News April 7, 2024
‘మంజుమ్మల్ బాయ్స్’ సరికొత్త రికార్డు

మాలీవుడ్‌లో రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ‘మంజుమ్మల్ బాయ్స్’ తెలుగులోనూ అదరగొడుతోంది. నిన్న విడుదలైన తొలి రోజే బుక్ మై షోలో 34.47 వేల టికెట్లు అమ్ముడుపోయినట్లు UV క్రియేషన్స్ ట్వీట్ చేసింది. మలయాళం డబ్బింగ్ మూవీకి ఇవే అత్యధికమని తెలిపింది. కంటెంట్ ఉన్న మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే దానికి ఇది నిదర్శనమని పేర్కొంది.
Similar News
News January 12, 2026
జగదీప్ ధన్‌ఖడ్‌కు తీవ్ర అస్వస్థత

మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈనెల 10న అర్ధరాత్రి 2 సార్లు స్పృహతప్పి పడిపోయారని ఆయన కార్యాలయం తెలిపింది. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో అడ్మిట్ చేసినట్లు చెప్పింది. 2025 మార్చిలోనూ ఆయన ఛాతీ నొప్పితో అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఎయిమ్స్ క్రిటికల్ కేర్ యూనిట్‌లో ఉంచి చికిత్స అందించారు. అనారోగ్య కారణాలతో గతేడాది జులైలో ఉపరాష్ట్రపతి పదవికి ఆయన <<17154846>>రాజీనామా<<>> చేయడం తెలిసిందే.
News January 12, 2026
శాంసంగ్‌కు చెక్.. టాప్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా యాపిల్

స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లలో యాపిల్ కంపెనీ నంబర్ వన్‌గా నిలిచింది. ఐఫోన్ 17 సక్సెస్, 16కు భారీ డిమాండ్, సేల్స్‌లో 10 శాతం గ్రోత్ సాధించడంతో గత 14 ఏళ్లలో తొలిసారిగా టాప్‌లోకి వచ్చింది. శాంసంగ్ రెండో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో యాపిల్ 20%, శాంసంగ్ 19%, షియోమీ 13%, వివో 8%, ఒప్పో 8%, ఇతర బ్రాండ్లు 32% వాటా కలిగి ఉన్నాయి.
News January 12, 2026
చర్చలకైనా, యుద్ధానికైనా మేం రెడీ: ఇరాన్

దాడి చేస్తామని ట్రంప్ <<18832950>>హెచ్చరిస్తున్న<<>> నేపథ్యంలో చర్చలకైనా, యుద్ధానికైనా తాము సిద్ధమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ప్రకటించారు. దేశంలో పరిస్థితి అదుపులోకి వచ్చిందని తెలిపారు. హింసకు మొస్సాద్ కారణమని ఆరోపించారు. మరోవైపు ప్రభుత్వ అనుకూల ర్యాలీల కోసం వేలమందిని రంగంలోకి దించినట్లు అంతర్జాతీయ మీడియా చెప్పింది. టెహ్రాన్‌తోపాటు ఇతర ప్రధాన సిటీల్లోనూ ప్రదర్శనలు చేస్తున్నట్లు తెలిపింది.


