News October 12, 2025
అర్ధరాత్రి అమ్మాయి ఎలా బయటికి వచ్చింది: మమత

MBBS స్టూడెంట్ గ్యాంగ్‌రేప్ ఘటనపై బెంగాల్ CM మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాలేజీ నుంచి అర్ధరాత్రి 12.30గం.కు అమ్మాయి ఎలా బయటికి వచ్చిందని ప్రశ్నించారు. రాత్రిపూట బయటకు రానివ్వకూడదని అన్నారు. అమ్మాయిలు తమను తాము రక్షించుకోవాలని చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ‘మణిపుర్, బిహార్, UP, ఒడిశాలో ఇలాంటివి జరిగాయి. అక్కడి ప్రభుత్వాలు కూడా కఠిన చర్యలు తీసుకోవాలి’ అని అన్నారు.
Similar News
News October 12, 2025
గెలిస్తే లిక్కర్ బ్యాన్ ఎత్తివేస్తాం: జన్ సురాజ్

త్వరలో జరగనున్న బిహార్ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే లిక్కర్ బ్యాన్ వెంటనే ఎత్తివేస్తామని జన్ సురాజ్ పార్టీ ప్రకటించింది. దీంతో రూ.28వేల కోట్ల రెవెన్యూ నష్టాన్ని భర్తీ చేస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ సింగ్ తెలిపారు. లిక్కర్ ద్వారా వచ్చే ఆదాయంతో ప్రపంచ బ్యాంకు, IMF నుంచి రూ.5-6లక్షల కోట్ల రుణాల సమీకరణకు ఉపయోగిస్తామని వెల్లడించారు. బిహార్‌లో 2016 నుంచి మద్యపాన నిషేధం అమలవుతోంది.
News October 12, 2025
ఉమెన్స్ WC: భారత్ గెలుస్తుందా?

ఉమెన్స్ వరల్డ్ కప్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఆస్ట్రేలియా విజయానికి 78 బంతుల్లో 86 రన్స్ కావాలి. ప్రస్తుతం క్రీజులో హీలీ (131), గార్డ్‌నర్ (31) ఉన్నారు. భారత్ గెలవాలంటే 7 వికెట్లు పడగొట్టాలి లేదా పరుగుల్ని కట్టడి చేయాలి. ప్రస్తుతం విన్ ప్రెడిక్షన్ ప్రకారం ఆస్ట్రేలియాకు 59%, ఇండియాకి 41% విజయావకాశాలున్నాయి. మరి ఈ మ్యాచులో మన టీమ్ గెలుస్తుందా? కామెంట్ చేయండి.
News October 12, 2025
బిగ్‌బాస్ నుంచి ఇద్దరు ఎలిమినేట్.. ఆరుగురి ఎంట్రీ

బిగ్‌బాస్ తెలుగు సీజన్-9 నుంచి ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. హౌస్ నుంచి ఫ్లోరా సైనీ, శ్రీజను ఎలిమినేట్ చేసినట్లు షో నిర్వాహకులు ప్రకటించారు. హౌస్‌లోకి కొత్తగా నిఖిల్ నాయర్ (సీరియల్ యాక్టర్), దివ్వెల మాధురి, శ్రీనివాస్ సాయి (గోల్కొండ హైస్కూల్ సినిమా ఫేమ్), రమ్య మోక్ష (అలేఖ్య చిట్టీ పికిల్స్), అయేషా(సీరియల్ నటి), గౌరవ్ గుప్తా (సీరియల్ నటుడు) వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు.