News October 12, 2025
ప్రధాని పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా జరగాలి: CM

ప్రధాని నరేంద్ర మోదీ జిల్లా పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు ఎటువంటి లోపం లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని CM చంద్రబాబు నాయుడు జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆదివారం విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏర్పాట్లపై సీఎం సమీక్ష నిర్వహించారు. కర్నూలు నుంచి స్పెషల్ ఆఫీసర్ వీర పాండేన్, జిల్లా కలెక్టర్ ఎ.సిరి, ఎస్పీ విక్రాంత్ పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు.
Similar News
News October 12, 2025
గద్వాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

*గద్వాల: ప్రతి సోమవారం యథావిధిగా ప్రజావాణి.
*రైతు ఆదాయం పెంచేందుకు కేంద్రం కొత్త పథకం.
*హమాలీలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి.
*అయిజ: స్థానిక ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి.
*ధన్ ధాన్య యోజన రైతులకు వరం.
*అలంపూర్: అభివృద్ధికి 15 కోట్లు.
*ఎర్రవల్లి: ఆటో నుంచి జారిపడి వ్యక్తి మృతి.
*ధరూర్: జూరాలకు తగ్గిన వరద.
*రాజోలి: సుంకేసులకు తగ్గిన వరద.
*మల్దకల్: ఆర్ఎస్ఎస్ పద సంచలన ర్యాలీ.
News October 12, 2025
కాకినాడ: వాగులోకి దిగి ఇద్దరు గల్లంతు

రంపచోడవరం మండలం కొత్త పాకల గ్రామ శివారు చాపరాయి వద్ద ఆదివారం సాయంత్రం స్నానం చేసేందుకు వాగులోకి దిగి పర్యాటకులు గల్లంతయిన ఘటన చోటుచేసుకుంది. కాకినాడకు చెందిన ఆరుగురు మిత్రులు విహారయాత్రకు రంపచోడవరానికి వచ్చారు. కొత్తపాకల శివారులో స్నానం చేసేందుకు అందరూ వాగులోకి దిగగా.. కాకినాడ జగన్నాథపురానికి చెందిన పసుపులేటి దుర్గాప్రసాద్, కరపకు చెందిన ఓలేటి మణికంఠ వాగులో గల్లంతయ్యారు. పోలీసులు గాలిస్తున్నారు.
News October 12, 2025
ఉమెన్స్ WC: భారత్ గెలుస్తుందా?

ఉమెన్స్ వరల్డ్ కప్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఆస్ట్రేలియా విజయానికి 78 బంతుల్లో 86 రన్స్ కావాలి. ప్రస్తుతం క్రీజులో హీలీ (131), గార్డ్‌నర్ (31) ఉన్నారు. భారత్ గెలవాలంటే 7 వికెట్లు పడగొట్టాలి లేదా పరుగుల్ని కట్టడి చేయాలి. ప్రస్తుతం విన్ ప్రెడిక్షన్ ప్రకారం ఆస్ట్రేలియాకు 59%, ఇండియాకి 41% విజయావకాశాలున్నాయి. మరి ఈ మ్యాచులో మన టీమ్ గెలుస్తుందా? కామెంట్ చేయండి.