News October 12, 2025
రేపు యథావిధిగా PGRS: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)ను సోమవారం యథావిధిగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ జి. లక్ష్మీశ ఆదివారం ప్రకటించారు. విజయవాడ కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఉదయం 10 గంటల నుంచి ప్రజల వద్ద ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు చెప్పారు. కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, మండల స్థాయిల్లో అధికారులు అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News October 12, 2025
కేంద్ర మంత్రిగా ఉన్నంత మాత్రాన ఏం చేయగలను: కిషన్ రెడ్డి

TG: 42% బీసీ రిజర్వేషన్లను HC తిరస్కరించడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కేంద్ర మంత్రిగా తాను ఉన్నంత మాత్రాన ఏం చేయగలనని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు కాదంటే రాష్ట్రపతి కూడా ఏమీ చేయలేరని అన్నారు. హైకోర్టులో వాదనలు వినిపించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. దీంతో BC రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిందన్నారు. రిజర్వేషన్లకు బీజేపీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
News October 12, 2025
ధర్మపురి: చాగంటి ప్రవచనలు.. భక్తులు మంత్రముగ్ధం

ధర్మపురి బ్రాహ్మణ సంఘం శ్రీవారి మఠం ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు భక్తులకు రెండో రోజు ఆధ్యాత్మిక ప్రవచనం అందించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం అడ్లూరి కుమారుడు హరీశ్వర్ రూపొందించిన లక్ష్మీనరసింహస్వామి లఘుచిత్రం ప్రోమో ఆవిష్కరించారు.
News October 12, 2025
మెదక్: సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలి: ఎస్పీ

ప్రజలు సైబర్ నేరాల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. లోన్ యాప్‌లు, జాబ్ ఫ్రాడ్‌లు, ఏపీకే ఫైల్స్‌తో డాటా చోరీ, క్రిప్టో కరెన్సీ పెట్టుబడి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. సైబర్ మోసాలకు గురైతే తక్షణమే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలని ఎస్పీ కోరారు.