News October 12, 2025

తురకపాలెం బాధితులకు ఆర్థిక సాయం అందజేసిన పెమ్మసాని

image

గుంటూరు(D) తురకపాలెంలో మెలియాయిడోసిస్ వ్యాధితోనే మరణాలు సంభవించాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. తెలియకుండానే వ్యాధి వ్యాప్తి జరిగిందని చెప్పారు. మరణించిన 28 మంది కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేశారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసానిచ్చారు. ఈ ప్రాంతంలో బ్లడ్ శాంపిల్స్ సేకరించి పరీక్షించేందుకు వైద్య నిపుణులను తీసుకొచ్చామన్నారు.

Similar News

News January 31, 2026

ఈ సెషన్‌లోనే పార్లమెంట్‌కు అమరావతి బిల్లు?

image

AP: రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే కేంద్ర హోంశాఖ నుంచి క్లియరెన్స్ లభించింది. ఇప్పుడు న్యాయశాఖ, పట్టణాభివృద్ధి వంటి 4 కేంద్ర శాఖల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. కేంద్ర క్యాబినెట్ ఆమోదించాక బిల్లును ఈ పార్లమెంట్‌ సెషన్‌లోనే ప్రవేశ పెట్టడానికి కూటమి MPలు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా ఆ బిల్లుపై YCP ఏ స్టాండ్ తీసుకుంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది.

News January 31, 2026

‘నో డ్యూ’తో మొండి బకాయిలు వసూలు!

image

TG: మున్సిపల్ ఎన్నికలతో ఇన్నాళ్ల మొండి బకాయిలు వసూలవుతున్నాయి. ఎలక్షన్స్‌లో పోటీ చేసే అభ్యర్థులకు ‘నో డ్యూ’ సర్టిఫికెట్ తప్పనిసరి కావడంతో వారంతా పెండింగ్ ట్యాక్స్ చెల్లిస్తున్నారు. నిజామాబాద్ 19వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి శమంతనరేందర్ తమ వంశీ హోటల్‌కు సంబంధించి ఏకంగా రూ.7.50కోట్ల ఆస్తిపన్ను కట్టారు. అన్ని మున్సిపాలిటీల్లో కలిపి రూ.50 కోట్లకు పైగా పన్నులు వసూలైనట్లు అధికారులు తెలిపారు.

News January 31, 2026

జుట్టు ఎందుకు రాలుతుందంటే?

image

మనిషి శరీరంలో ఉండే ఇమ్యూనిటీ సెల్ అలోప్సియా అరెటా జుట్టు రాలడానికి కారణమవుతుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. కొరియా అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు ఈ విషయాన్ని గుర్తించారు. అలోప్సియా అరెటా అనేది జుట్టుకు సంబంధించిన ఒక వ్యాధి. ఇది జుట్టు కుదుళ్లను బలహీనపరిచి జుట్టును ఎక్కువగా రాలిపోయేలా చేస్తుందని వారు తెలిపారు. ఇది ఇమ్యునిటీ తగ్గడం వల్ల కూడా జరుగుతుందని అన్నారు.