News October 12, 2025
జూబ్లీహిల్స్ బైపోల్.. ఓటర్ 50-50!

HYDలో ఎన్నికలు అంటే నేతల్లో హడావిడి మామూలుగా ఉండదు. ప్రచారంలో పోటాపోటీ కనిపిస్తుంది. కానీ, ఇంత ఆర్భాటం చేసినా ఓటరు మహాశయులు సిటీలో ఎలక్షన్స్ అంటే దూరంగా ఉంటారు. జూబ్లీహిల్స్‌లో ఈ పరిస్థితి మరీ ఎక్కువ. 2023 ఎన్నికల్లోనూ ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు కృషి చేసినా 50% శాతానికే పరిమితం అయ్యింది. ఇక ఈ బైపోల్‌లో అయినా ఓటర్లు పోలింగ్‌కు వస్తారా? ఎప్పటిలాగే 50-50 అంటారా అనేది వేచి చూడాల్సిందే.
Similar News
News October 12, 2025
APలో బీచ్‌కెళ్లిన ముగ్గురు హైదరాబాదీలు మృతి

బాపట్లలోని చీరాల బీచ్‌లో హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు యువకులు చనిపోయారు. AP పోలీసుల వివరాలు.. నగరానికి చెందిన శ్రీసాకేత్, సాయిమణిదీప్, జీవన్ సాత్విక్ అమరావతిలోని విట్‌లో చదువుతున్నారు. ఆదివారం సాయంత్రం కాలేజీ ఫ్రెండ్స్‌తో కలిసి బీచ్‌కు వెళ్లారు. స్నానం చేస్తుండగా అలల తాకిడికి సముద్రంలో గల్లంతు అయ్యారు. గాలింపు చేపట్టగా శ్రీసాకేత్, సాయిమణిదీప్, జీవన్ సాత్విక్ మృతదేహాలు లభ్యమయ్యాయి.
News October 12, 2025
రంజీ: హైదరాబాద్‌కు తి’లక్’ తెచ్చేనా?

గుమ్మడికాయంత టాలెంట్ ఉన్నా.. ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు. సిటీ ఆటగాళ్లలో టాలెంట్‌కు కొదవలేదు కానీ.. లక్కే లేదని టోర్నీకి ముందు చర్చ. 2024లో ప్లేట్ గ్రూపు నుంచి ఎలైట్ గ్రూపునకు HYD ప్రమోట్ అవ్వడానికి తి’లక్’ రూపంలో కలిసివచ్చింది. ఇందులో 3 శతకాలతో అదరగొట్టి HCAలో కొత్త ఆశలు పుట్టించారు. ఇదే జోష్‌లో ఈ సారి టైటిల్ కొడితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రూపురేఖలు మారి BCCIలో మన ప్రాతినిథ్యం పెరుగుతుంది.
News October 12, 2025
‘రంజీ’ తెచ్చిన హైదరాబాదీ!

సిటీలోనే పుట్టి, పెరిగారు ఆయన. క్రికెట్ అంటే ఆసక్తి. పుట్టిన గడ్డ పేరు నిలబెట్టాలని గట్టి నిర్ణయం తీసుకున్నారేమో మరి. దేశవాలీ క్రికెట్‌లో మన హైదరాబాద్ పేరును మారుమోగించారు. ఆయనే నవాబ్ సయ్యద్ మొహమ్మద్ హుస్సేన్. నిజాం కాలేజీలో చదివిన ఆయన క్రికెట్‌లో రాణించారు. ఆయన ప్రతిభతో రంజీ ట్రోఫీ ఛాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌కు సారథి అయ్యారు. ఈయన కెప్టెన్సీలోనే (1937-38) రంజీ 3వ టైటిల్‌ను HYD గెలిచింది.