News October 12, 2025

వరంగల్ ఖిల్లాను మళ్లీ చూడటం సంతోషంగా ఉంది: సజ్జనార్

image

SMలో ఎప్పుడూ యాక్టివ్ ఉండే HYD పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్.. తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. వరంగల్ ఖిల్లాను మరోసారి చూడటం ఎంత సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. 17 ఏళ్ల క్రితం తొలిసారి ఓరుగల్లు కోటను సందర్శించానని, దాన్ని రీ విజిట్ చేయడం ఇన్నాళ్లకు సాధ్యమైందన్నారు. ఎంత బిజీగా ఉన్నా.. ఫ్యామిలీకి సమయం కేటాయిస్తే ఆ ఆనందం వేరని పేర్కొన్నారు. తనతో ఖిల్లాను సందర్శించిన ఫొటోను షేర్ చేశారు.

Similar News

News October 13, 2025

రేపే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్

image

TG: జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది. రేపటి నుంచి ఈ నెల 21 వరకు నామినేషన్ల స్వీకరణ, 22న నామినేషన్ల పరిశీలన, 24వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇస్తారు. అదే రోజు సాయంత్రం అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. నవంబర్ 11న పోలింగ్, 14న ఫలితాలు ప్రకటిస్తారు. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో ఇక్కడ బైపోల్ అనివార్యమైన విషయం తెలిసిందే.

News October 12, 2025

మంత్రి లోకేశ్ సమీక్షలో కలెక్టర్ రాంసుందర్ రెడ్డి

image

విశాఖపట్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు విజయనగరం కలెక్టర్ రాంసుందర్ రెడ్డి హాజరయ్యారు. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మంత్రికి వివరించారు. సమావేశంలో ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

News October 12, 2025

విజయనగరం జిల్లాలో నేటి ప్రధాన వార్తలు

image

➤శ్రీ పైడిమాంబ తెప్పోత్సవానికి చురుకుగా ఏర్పాట్లు, రేపు ట్రయిల్ రన్
➤కల్తీ మద్యం కేసులో టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారన్న చిన్న శ్రీను
➤విజయనగరంలో పీఆర్ ఇంజినీర్స్ అసోసియేషన్ సమావేశం
➤మంత్రి లోకేశ్‌తో కిమిడి నాగార్జున భేటీ
➤క్షత్రీయుల సంక్షేమానికి కృషి చేస్తానన్న ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు
➤టీడీపీ నూతన కమిటీలను ప్రకటించిన ఎమ్మెల్యే అదితి
➤కొత్తవలసలో జరిగిన ఘర్షణలో వ్యక్తి మృతి