News October 12, 2025
రాష్ట్ర బంద్ వాయిదా: BC JAC

TG: రిజర్వేషన్ల సాధన కోసం బీసీ నేత ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్ అక్టోబర్ 14 నుంచి 18వ తేదీకి వేశారు. రిజర్వేషన్ల కోసం ఇవాళ పలు బీసీ సంఘాలు ఒక్కటై BC JACగా ఏర్పడ్డాయి. ఆ జేఏసీ ఛైర్మెన్‌గా ఆర్.కృష్ణయ్య, వైస్ ఛైర్మన్‌గా వీజీఆర్ నారగొని తదితరులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చర్చలు జరిపి బంద్‌ను వాయిదా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో అమలుపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే.
Similar News
News October 13, 2025
రేపే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్

TG: జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది. రేపటి నుంచి ఈ నెల 21 వరకు నామినేషన్ల స్వీకరణ, 22న నామినేషన్ల పరిశీలన, 24వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇస్తారు. అదే రోజు సాయంత్రం అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. నవంబర్ 11న పోలింగ్, 14న ఫలితాలు ప్రకటిస్తారు. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో ఇక్కడ బైపోల్ అనివార్యమైన విషయం తెలిసిందే.
News October 12, 2025
కేంద్ర మంత్రిగా ఉన్నంత మాత్రాన ఏం చేయగలను: కిషన్ రెడ్డి

TG: 42% బీసీ రిజర్వేషన్లను HC తిరస్కరించడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కేంద్ర మంత్రిగా తాను ఉన్నంత మాత్రాన ఏం చేయగలనని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు కాదంటే రాష్ట్రపతి కూడా ఏమీ చేయలేరని అన్నారు. హైకోర్టులో వాదనలు వినిపించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. దీంతో BC రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిందన్నారు. రిజర్వేషన్లకు బీజేపీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
News October 12, 2025
గెలిస్తే లిక్కర్ బ్యాన్ ఎత్తివేస్తాం: జన్ సురాజ్

త్వరలో జరగనున్న బిహార్ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే లిక్కర్ బ్యాన్ వెంటనే ఎత్తివేస్తామని జన్ సురాజ్ పార్టీ ప్రకటించింది. దీంతో రూ.28వేల కోట్ల రెవెన్యూ నష్టాన్ని భర్తీ చేస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ సింగ్ తెలిపారు. లిక్కర్ ద్వారా వచ్చే ఆదాయంతో ప్రపంచ బ్యాంకు, IMF నుంచి రూ.5-6లక్షల కోట్ల రుణాల సమీకరణకు ఉపయోగిస్తామని వెల్లడించారు. బిహార్‌లో 2016 నుంచి మద్యపాన నిషేధం అమలవుతోంది.