News October 12, 2025

WWC: భారత్ ఆలౌట్.. స్కోర్ ఎంతంటే?

image

మహిళల ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో 48.5 ఓవర్లలో భారత్ 330 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు ప్రతిక (75), స్మృతి మంధాన (80) అదిరిపోయే భాగస్వామ్యం ఇవ్వడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. తర్వాత వచ్చిన హర్లీన్ డియోల్, జెమీమా, రిచా ఘోష్ ఫర్వాలేదనిపించారు. చివర్లో 36 పరుగుల వ్యవధిలో భారత్ 6 వికెట్లు కోల్పోయింది. ఆసీస్ బౌలర్లలో అన్నాబెల్ 5, సోఫీ 3 వికెట్లతో రాణించారు.

Similar News

News October 13, 2025

హామీలకు హద్దులుండవా?

image

బిహార్‌లో ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఇస్తున్న హామీలకు హద్దులు ఉండవా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాము గెలిస్తే లిక్కర్ బ్యాన్ ఎత్తేస్తామని <<17988426>>JSP<<>> తాజాగా ప్రకటించింది. చాలా రాష్ట్రాల్లో కుదరని, సదుద్దేశంతో అమలు చేస్తున్న బ్యాన్‌ను ఎత్తేస్తామనడం కరెక్టేనా అని SMలో చర్చ జరుగుతోంది. అటు తాము గెలిస్తే ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తేజస్వీ చెప్పిన విషయం తెలిసిందే. ఈ హామీలపై మీ COMMENT.

News October 13, 2025

రేపే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్

image

TG: జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది. రేపటి నుంచి ఈ నెల 21 వరకు నామినేషన్ల స్వీకరణ, 22న నామినేషన్ల పరిశీలన, 24వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇస్తారు. అదే రోజు సాయంత్రం అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. నవంబర్ 11న పోలింగ్, 14న ఫలితాలు ప్రకటిస్తారు. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో ఇక్కడ బైపోల్ అనివార్యమైన విషయం తెలిసిందే.

News October 12, 2025

కేంద్ర మంత్రిగా ఉన్నంత మాత్రాన ఏం చేయగలను: కిషన్ రెడ్డి

image

TG: 42% బీసీ రిజర్వేషన్లను HC తిరస్కరించడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కేంద్ర మంత్రిగా తాను ఉన్నంత మాత్రాన ఏం చేయగలనని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు కాదంటే రాష్ట్రపతి కూడా ఏమీ చేయలేరని అన్నారు. హైకోర్టులో వాదనలు వినిపించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. దీంతో BC రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిందన్నారు. రిజర్వేషన్లకు బీజేపీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.