News October 12, 2025
శ్రీశైలంలో పటిష్ఠ బందోబస్తు: SP

ఈనెల 16న ప్రధాని పర్యటన సందర్భంగా శ్రీశైలంలో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ తెలిపారు. ఆదివారం శ్రీశైలంలో బందోబస్తు ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు. శ్రీశైల పరిసర ప్రాంతాలలు, నల్లమల అడవీ ప్రాంతాల్లో గ్రేహౌండ్స్ సాయుధ బలగాలు ప్రధాని పర్యటనకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
Similar News
News October 13, 2025
హామీలకు హద్దులుండవా?

బిహార్‌లో ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఇస్తున్న హామీలకు హద్దులు ఉండవా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాము గెలిస్తే లిక్కర్ బ్యాన్ ఎత్తేస్తామని <<17988426>>JSP<<>> తాజాగా ప్రకటించింది. చాలా రాష్ట్రాల్లో కుదరని, సదుద్దేశంతో అమలు చేస్తున్న బ్యాన్‌ను ఎత్తేస్తామనడం కరెక్టేనా అని SMలో చర్చ జరుగుతోంది. అటు తాము గెలిస్తే ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తేజస్వీ చెప్పిన విషయం తెలిసిందే. ఈ హామీలపై మీ COMMENT.
News October 13, 2025
రేపే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్

TG: జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది. రేపటి నుంచి ఈ నెల 21 వరకు నామినేషన్ల స్వీకరణ, 22న నామినేషన్ల పరిశీలన, 24వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇస్తారు. అదే రోజు సాయంత్రం అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. నవంబర్ 11న పోలింగ్, 14న ఫలితాలు ప్రకటిస్తారు. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో ఇక్కడ బైపోల్ అనివార్యమైన విషయం తెలిసిందే.
News October 12, 2025
మంత్రి లోకేశ్ సమీక్షలో కలెక్టర్ రాంసుందర్ రెడ్డి

విశాఖపట్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు విజయనగరం కలెక్టర్ రాంసుందర్ రెడ్డి హాజరయ్యారు. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మంత్రికి వివరించారు. సమావేశంలో ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.