News October 12, 2025
మంత్రి పొంగులేటి మేడారం పర్యటన వివరాలివే!

మేడారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం పర్యటించనున్న విషయం తెలిసిందే. ఉ. 9:30కి బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి 10:30కి మేడారం చేరుకుంటారు. 10:45కు సమ్మక్క, సారలమ్మను దర్శించుకోనున్నాను. 11 గం.కు అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. 11:30కు జాతర అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఒంటి గంటకు బయల్దేరి మ. 2 గం.కు హైదరాబాద్ చేరుకుంటారు.
Similar News
News October 13, 2025
రేపు ఉదయం లోగా పలు జిల్లాల్లో వర్షాలు!

TG: రాష్ట్రంలో రేపు ఉదయం 8.30గంటల లోపు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.
News October 13, 2025
హామీలకు హద్దులుండవా?

బిహార్‌లో ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఇస్తున్న హామీలకు హద్దులు ఉండవా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాము గెలిస్తే లిక్కర్ బ్యాన్ ఎత్తేస్తామని <<17988426>>JSP<<>> తాజాగా ప్రకటించింది. చాలా రాష్ట్రాల్లో కుదరని, సదుద్దేశంతో అమలు చేస్తున్న బ్యాన్‌ను ఎత్తేస్తామనడం కరెక్టేనా అని SMలో చర్చ జరుగుతోంది. అటు తాము గెలిస్తే ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తేజస్వీ చెప్పిన విషయం తెలిసిందే. ఈ హామీలపై మీ COMMENT.
News October 13, 2025
రేపే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్

TG: జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది. రేపటి నుంచి ఈ నెల 21 వరకు నామినేషన్ల స్వీకరణ, 22న నామినేషన్ల పరిశీలన, 24వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇస్తారు. అదే రోజు సాయంత్రం అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. నవంబర్ 11న పోలింగ్, 14న ఫలితాలు ప్రకటిస్తారు. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో ఇక్కడ బైపోల్ అనివార్యమైన విషయం తెలిసిందే.