News October 12, 2025
ఏలూరు జిల్లా వ్యాప్తంగా శక్తి టీం విజిబుల్ పోలీసింగ్

ఏలూరు జిల్లా వ్యాప్తంగా నాలుగు సబ్ డివిజన్ల పరిధిలో శక్తి టీం సభ్యులు ఆదివారం సాయంత్రం ‘విజిబుల్ పెట్రోలింగ్’ నిర్వహించారు. మహిళలకు భరోసా కల్పిస్తూ, 112 ఫోన్ నెంబర్, ‘శక్తి యాప్’ ఆవశ్యకతను వివరించినట్లు శక్తి టీం ఇన్‌చార్జి సుబ్బారావు తెలిపారు. విద్యార్థులకు, మహిళలకు శక్తి టీం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సీఐ భరోసా ఇచ్చారు.
Similar News
News October 13, 2025
TODAY HEADLINES

☛ ‘AP ఎక్సైజ్ సురక్షా యాప్’ను రిలీజ్ చేసిన సీఎం చంద్రబాబు
☛ విశాఖ అభివృద్ధికి 10 ఏళ్లు చాలు: మంత్రి లోకేశ్
☛ SRSP-2కి దామోదర్ రెడ్డి పేరు: CM రేవంత్
☛ TG బంద్ వాయిదా: BC JAC
☛ ‘స్థానిక’ ఎన్నికలు: రేపు సుప్రీంకోర్టుకు TG సర్కార్
☛ బిహార్‌లో NDA సీట్ల షేరింగ్ ఖరారు.. BJPకి 101 సీట్లు
☛ ఉమెన్స్ WC: భారత్ పై ఆస్ట్రేలియా విజయం
☛ అఫ్గాన్ దాడులు.. 15 మంది పాక్ సైనికులు హతం
News October 13, 2025
CRDA ఆఫీస్ ప్రారంభానికి సర్వం సిద్ధం: నారాయణ

AP: అమరావతిలో CRDA ప్రధాన ఆఫీస్ ప్రారంభానికి సర్వం సిద్ధమైనట్లు మంత్రి నారాయణ తెలిపారు. రేపు 9.54AMకు CM CBN కార్యాలయాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. తదుపరి ఆయనకు ఢిల్లీ పర్యటన ఉండటంతో బహిరంగ సమావేశం ఉండదన్నారు. ఈ ఆఫీస్ ప్రారంభోత్సవానికి రైతులందరూ ఆహ్వానితులే అని వెల్లడించారు. రాజధానిలోని సీడ్ యాక్సిస్ రోడ్ E3-N11 జంక్షన్ వద్ద రాయపూడి సమీపంలో CRDA ఆఫీస్ నిర్మించిన విషయం తెలిసిందే.
News October 13, 2025
రేపు ఉదయం లోగా పలు జిల్లాల్లో వర్షాలు!

TG: రాష్ట్రంలో రేపు ఉదయం 8.30గంటల లోపు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.