News October 12, 2025
నిజామాబాద్: DCC పదవికి దరఖాస్తు చేసుకున్న వేణుగోపాల్ యాదవ్

నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పీసీసీ అధికార ప్రతినిధి కమ్మర్‌పల్లికి చెందిన సీనియర్ నాయకుడు బాస వేణుగోపాల్ యాదవ్ దరఖాస్తు చేసుకున్నారు. పార్టీ నిర్మాణ పటిష్టత కోసం నూతన అధ్యక్షుల నియామక ప్రక్రియ మొదలైన సంగతి తెలిసిందే. జిల్లా అబ్జర్వ్‌గా కర్ణాటక ఎమ్మెల్యే రిజ్వాన్‌ను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది.
Similar News
News October 13, 2025
ఒక్క రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు: ఆర్మూర్ ఎమ్మెల్యే

దీపావళి పండగకు టపాసుల దుకాణ సముదాయాలు ఏర్పాటు చేయాలనుకునేవారు ఒక్క రూపాయి కూడా ఎవ్వరికీ లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన విధంగా చలాన్లు కట్టి దుకాణాలు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తన దృష్టికి తీసుకురావాలన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
News October 12, 2025
NZB: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

నిజామాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందినట్లు మూడో టౌన్ ఎస్ఐ హరిబాబు ఆదివారం తెలిపారు. ప్రశాంత్, సందీప్ శనివారం రాత్రి బైక్‌పై శివాజీ చౌక్ నుంచి దుబ్బా వైపు వెళ్తుండగా.. కృష్ణ మందిరం వద్ద సైకిల్‌ను తప్పించబోయి డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ప్రశాంత్, సందీప్ గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించగా ప్రశాంత్ మృతి చెందారు.
News October 12, 2025
NZB: DCC పదవికి దరఖాస్తు చేసుకున్న అయ్యప్ప శ్రీనివాస్

నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ పదవి కోసం ఆర్మూర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయ్యప్ప శ్రీనివాస్ దరఖాస్తు చేసుకున్నారు. కాగా, పార్టీ సంస్థాగత నిర్మాణ పటిష్టత కోసం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే. జిల్లా పరిశీలకుడిగా కర్ణాటక ఎమ్మెల్యే రిజ్వాన్‌ను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. జంబి హనుమాన్ ఆలయ ఛైర్మన్ రేగుల్ల సత్యనారాయణ తదితరులున్నారు.