News October 12, 2025
తిరుపతి : ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో నేషనల్ హెల్త్ మిషన్ (NHM) ప్రాజెక్టులో భాగంగా కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ పద్ధతిలో వివిధ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం పేర్కొంది. మొత్తం 10 విభాగాలలో 56 ఖాళీలు ఉన్నట్లు తెలియజేశారు. అర్హత, ఇతర వివరాలకు https://chittoor.ap.gov.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 22.
Similar News
News October 13, 2025
నల్గొండకు పోటెత్తారు

నల్గొండ హజరత్ సయ్యద్ షా లతీఫ్ ఉల్లా ఖాద్రి దర్గా ఉర్సు ఉత్సవాలు ఆదివారం భక్తుల సందడితో మరింత శోభాయమానమయ్యాయి. సెలవు దినం కావడంతో భక్తులు కుటుంబ సమేతంగా నల్గొండకు పట్టణానికి పోటెత్తారు. దర్గా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. పరిసరాల్లో ఏర్పాటు చేసిన మేళా దుకాణాలు కొనుగోళ్లతో కళకళలాడాయి. క్లాక్ టవర్ సెంటర్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ఉత్సవాల వైభవం స్పష్టమైంది.
News October 13, 2025
ఆదిలాబాద్‌లో రియాల్టీ ముఠా భారీ కుంభకోణం

ఆదిలాబాద్‌లో రియాల్టీ ముఠా భారీ కుంభకోణాన్ని బయట పట్టినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. సూర్య రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు చేసి దర్యాప్తు చేశామన్నారు. ఈడీ, ఎస్బీఐ మార్టగేజ్ అధీనంలో ఉన్న భూమిని కబ్జా చేసి బెదిరింపులకు పాల్పడిన ముఠాలో నిందితులు రమేష్ శర్మ, ఇబ్రహీం మహమ్మద్ అరెస్టు చేశామన్నారు. అదేవిధంగా యతేంద్రనాథ్, హితేంద్రనాథ్, రాకేష్, మనోజ్ కుమార్, పూనం, అనుపమ, శివాజీపై కేసు చేశామన్నారు.
News October 13, 2025
అక్టోబర్ 13: చరిత్రలో ఈ రోజు

1965: హాస్య నటి కల్పనా రంజనీ జననం
1973: కవి, గీత రచయిత కందికొండ యాదగిరి జననం
1987: బాలీవుడ్ నటుడు కిషోర్ కుమార్ మరణం
1990: హీరోయిన్ పూజా హెగ్డే(ఫొటోలో) జననం
1993: టీమ్ ఇండియా క్రికెటర్ హనుమ విహారి జననం
*ప్రకృతి వైపరీత్యాల నిరోధక దినోత్సవం