News October 12, 2025

రేపు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు: APSDMA

image

AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపు పలు జిల్లాలకు APSDMA వర్షసూచన చేసింది. సోమవారం అల్లూరి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఉరుములు, మెరుపులతో వర్షాలు పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Similar News

News October 13, 2025

చైనాను బాధ పెట్టాలి అనుకోవట్లేదు: ట్రంప్

image

చైనాకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదనంగా 100% టారిఫ్స్ విధించిన విషయం తెలిసిందే. అయితే తాను చైనాను బాధ పెట్టాలి అనుకోవట్లేదని పేర్కొన్నారు. ‘చైనా గురించి ఆందోళన వద్దు ఆ దేశం బాగానే ఉంటుంది. అధ్యక్షుడు జిన్‌పింగ్ కాస్త గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు. ఆయన గానీ, నేను గానీ చైనాకు ఇబ్బందులు రావాలి అనుకోవట్లేదు. US చైనాకు సాయం చేయాలనుకుంటోది. దానిని బాధించాలని కాదు’ అని ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.

News October 13, 2025

అక్టోబర్ 13: చరిత్రలో ఈ రోజు

image

1965: హాస్య నటి కల్పనా రంజనీ జననం
1973: కవి, గీత రచయిత కందికొండ యాదగిరి జననం
1987: బాలీవుడ్ నటుడు కిషోర్ కుమార్ మరణం
1990: హీరోయిన్ పూజా హెగ్డే(ఫొటోలో) జననం
1993: టీమ్ ఇండియా క్రికెటర్ హనుమ విహారి జననం
*ప్రకృతి వైపరీత్యాల నిరోధక దినోత్సవం

News October 13, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.