News October 12, 2025
గద్వాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

*గద్వాల: ప్రతి సోమవారం యథావిధిగా ప్రజావాణి.
*రైతు ఆదాయం పెంచేందుకు కేంద్రం కొత్త పథకం.
*హమాలీలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి.
*అయిజ: స్థానిక ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి.
*ధన్ ధాన్య యోజన రైతులకు వరం.
*అలంపూర్: అభివృద్ధికి 15 కోట్లు.
*ఎర్రవల్లి: ఆటో నుంచి జారిపడి వ్యక్తి మృతి.
*ధరూర్: జూరాలకు తగ్గిన వరద.
*రాజోలి: సుంకేసులకు తగ్గిన వరద.
*మల్దకల్: ఆర్ఎస్ఎస్ పద సంచలన ర్యాలీ.
Similar News
News October 13, 2025
పాక్-అఫ్గాన్ మధ్య ఇరాన్ మధ్యవర్తిత్వం

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య పరిస్థితులను చక్కదిద్దేందుకు ముస్లిం దేశాలు ముందుకొచ్చాయి. ఇరు దేశాలు తమ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సౌదీ అరేబియా, ఇరాన్, ఖతార్ దేశాలు తెలిపాయి. ఇరాన్ మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతానికి కాల్పులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అఫ్గాన్ విదేశాంగ మంత్రి తెలిపారు. కాబుల్‌లో పాక్ జరిపిన వైమానిక దాడుల నేపథ్యంలోనే ఘర్షణలు మళ్లీ మొదలయ్యాయి.
News October 13, 2025
VKB: ఇసుక మాఫియాకు రాజకీయ నాయకుల అండా.?

VKB జిల్లాలోని ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. ఈ దందాకు అంతా బడా నాయకుల అండ దండలతోనే సాగుతుందని విశ్వసనీయ సమాచారం. దీనిని అరికట్టేందుకు పోలీసులు, టాస్క్‌ఫోర్స్ బృందాలు ప్రయత్నించిన వారిపైకి వాహనాలు ఎక్కిచ్చేస్తున్నారు. తాజాగా తాండూర్ ఓ సంఘటన చోటుచేసుకుంది. వాహనాలు ఆపిన మరుక్షణమే ఓ బడా నాయకుడితో ఫోన్ వచ్చేస్తుంది. వెంటనే విడిచిపెట్టకుంటే బెదిరింపులు పాల్పడుతున్నారని ప్రజలు వాపోతున్నారు.
News October 13, 2025
నంద్యాలలో నేడు ఎస్పీ PGRS రద్దు

నంద్యాల జిల్లాలోని SP కార్యాలయంలో సోమవారం జరగవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు SP సునీల్ షెరాన్ తెలిపారు. అనివార్య కారణాలవల్ల తాత్కాలికంగా కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగిందని అన్నారు. కాబట్టి ప్రజలు ఎవరూ జిల్లా కేంద్రానికి రావద్దని సూచించారు. అక్టోబర్ 20వ తేదీన తిరిగి PGRSను యధావిధిగా కొనసాగిస్తామని ఆయన అన్నారు.