News October 12, 2025

ధర్మపురి: చాగంటి ప్రవచనలు.. భక్తులు మంత్రముగ్ధం

image

ధర్మపురి బ్రాహ్మణ సంఘం శ్రీవారి మఠం ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు భక్తులకు రెండో రోజు ఆధ్యాత్మిక ప్రవచనం అందించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం అడ్లూరి కుమారుడు హరీశ్వర్ రూపొందించిన లక్ష్మీనరసింహస్వామి లఘుచిత్రం ప్రోమో ఆవిష్కరించారు.

Similar News

News October 13, 2025

వికారాబాద్: పాఠశాలల పర్యవేక్షణకు ప్రత్యేక టీమ్‌లు

image

VKB జిల్లాలో 707 ప్రాథమిక పాఠశాలల పర్యవేక్షణకు 7 టీంలను ఏర్పాటు చేయనున్నారు. PS HM నోడల్ ఆఫీసర్‌గా, ఇద్దరు SGT టీచర్లు మెంబర్లుగా ఉంటారు. 115 UPSలకు ఒక టీం ఏర్పాటు కానుంది. ఇందులో SA నోడల్ ఆఫీసర్‌గా, ఒక PS HM, ఒక SGT ఉంటారు. 176 హై స్కూల్స్ పర్యవేక్షణకు ఒక GHMతో పాటు ఏడుగురు సబ్జెక్టు టీచర్లు, PDతో కూడిన 4 టీంలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ ఉత్తర్వులు జారిచేశారు.

News October 13, 2025

1.7M బాట్ అకౌంట్స్ డిలీట్ చేసిన ‘X’

image

తాము ఈ వారంలో 1.7 మిలియన్ల బాట్ అకౌంట్స్ డిలీట్ చేసినట్లు ‘X'(ట్విట్టర్) పేర్కొంది. ఎలాన్ మస్క్ ఈ సంస్థను కొనుగోలు చేసినప్పుడే ‘X’ నుంచి బాట్ అకౌంట్స్‌ను పూర్తిగా తొలగిస్తానని మాటిచ్చిన విషయం తెలిసిందే. ‘రిప్లై స్పామ్‌లో భాగమైన 17 లక్షల బాట్ అకౌంట్స్ డిలీట్ చేశాం. రాబోయే రోజుల్లో మీరు మార్పు గమనిస్తారు. DM స్పామ్ మీద ఫోకస్ చేయబోతున్నాం.’ అని ఆ సంస్థ ప్రొడక్ట్ హెడ్ నికితా బియర్ పేర్కొన్నారు.

News October 13, 2025

పాక్-అఫ్గాన్ మధ్య ఇరాన్ మధ్యవర్తిత్వం

image

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య పరిస్థితులను చక్కదిద్దేందుకు ముస్లిం దేశాలు ముందుకొచ్చాయి. ఇరు దేశాలు తమ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సౌదీ అరేబియా, ఇరాన్, ఖతార్ దేశాలు తెలిపాయి. ఇరాన్ మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతానికి కాల్పులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అఫ్గాన్ విదేశాంగ మంత్రి తెలిపారు. కాబుల్‌లో పాక్ జరిపిన వైమానిక దాడుల నేపథ్యంలోనే ఘర్షణలు మళ్లీ మొదలయ్యాయి.