News October 12, 2025
బాచుపల్లి రోడ్డులో వాహనదారుల కష్టాలు! పట్టించుకునే వారే లేరా?

నిజాంపేట, బాచుపల్లి, మల్లంపేట రహదారిలో వాహనదారులు, పాదచారులకు కష్టాలు తప్పడం లేదు. రోడ్డు బాగాలేకపోవడం, బాచుపల్లిలో ఫైఓవర్, రహదారి నిర్మాణం పూర్తికాకపోవడం, అనేకచోట్ల కంకర తేలడం, మరోవైపు డస్ట్ న్యూసెన్స్ విపరీతంగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిజాంపేట-మల్లంపేట వరకు నిత్యం తీవ్ర అవస్థలు పడుతున్నట్లు వాహనదారులు వాపోతున్నారు. నెలలు గడుస్తున్నప్పటికీ సమస్యలకు పరిష్కారం దొరకడం లేదని తెలిపారు.
Similar News
News October 13, 2025
KMR: 9 ఏళ్లు గడిచినా.. వసతుల విస్మరణ

కామారెడ్డి జిల్లాగా ఆవిర్భవించిన తర్వాత పాలన ప్రజలకు చేరువైంది. కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు, పంచాయతీలు ఏర్పాటు కావడంతో పరిపాలన వికేంద్రీకరణ జరిగింది. అయితే, జిల్లాల పునర్విభజన జరిగి 9 ఏళ్లు గడిచినా, కొత్తగా ఏర్పాటైన మండలాల్లోని అనేక ప్రభుత్వ కార్యాలయాలకు ఇప్పటికీ సొంత భవనాలు లేవు. ఎంతో ఆశయంతో జిల్లాలను పునర్వ్యవస్థీకరించినా, కనీస మౌలిక వసతుల కల్పనలో జాప్యం జరుగుతోంది.
News October 13, 2025
వికారాబాద్: పాఠశాలల పర్యవేక్షణకు ప్రత్యేక టీమ్‌లు

VKB జిల్లాలో 707 ప్రాథమిక పాఠశాలల పర్యవేక్షణకు 7 టీంలను ఏర్పాటు చేయనున్నారు. PS HM నోడల్ ఆఫీసర్‌గా, ఇద్దరు SGT టీచర్లు మెంబర్లుగా ఉంటారు. 115 UPSలకు ఒక టీం ఏర్పాటు కానుంది. ఇందులో SA నోడల్ ఆఫీసర్‌గా, ఒక PS HM, ఒక SGT ఉంటారు. 176 హై స్కూల్స్ పర్యవేక్షణకు ఒక GHMతో పాటు ఏడుగురు సబ్జెక్టు టీచర్లు, PDతో కూడిన 4 టీంలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ ఉత్తర్వులు జారిచేశారు.
News October 13, 2025
1.7M బాట్ అకౌంట్స్ డిలీట్ చేసిన ‘X’

తాము ఈ వారంలో 1.7 మిలియన్ల బాట్ అకౌంట్స్ డిలీట్ చేసినట్లు ‘X'(ట్విట్టర్) పేర్కొంది. ఎలాన్ మస్క్ ఈ సంస్థను కొనుగోలు చేసినప్పుడే ‘X’ నుంచి బాట్ అకౌంట్స్‌ను పూర్తిగా తొలగిస్తానని మాటిచ్చిన విషయం తెలిసిందే. ‘రిప్లై స్పామ్‌లో భాగమైన 17 లక్షల బాట్ అకౌంట్స్ డిలీట్ చేశాం. రాబోయే రోజుల్లో మీరు మార్పు గమనిస్తారు. DM స్పామ్ మీద ఫోకస్ చేయబోతున్నాం.’ అని ఆ సంస్థ ప్రొడక్ట్ హెడ్ నికితా బియర్ పేర్కొన్నారు.