News October 13, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News October 13, 2025

నేడు విద్యుత్ ఉద్యోగ జేఏసీతో ట్రాన్స్‌కో చర్చలు

image

AP: సమస్యల పరిష్కారానికి ఈ నెల 15నుంచి సమ్మె చేపడతామన్న విద్యుత్ ఉద్యోగ సంఘాలు యాజమాన్యానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సమస్యల పరిష్కారానికి చర్చకు సోమవారం రావాలని పవర్ ఎంప్లాయిస్ జేఏసీకి ట్రాన్స్‌కో లేఖ రాసింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంస్థ కట్టుబడి ఉందని లేఖలో పేర్కొంది. ప్రజల, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ సంస్థలు సజావుగా సాగేలా చూడాలని ఉద్యోగులను కోరింది.

News October 13, 2025

సంసార సాగరాన్ని దాటించే శివ లింగార్చన

image

శివుని గురించి శ్రవణం, కీర్తన, మననం చేయడం గొప్ప సాధన. ఈ సాధన ఆచరించలేని సామాన్యులు నిత్యం శివలింగార్చన చేస్తే చాలు. భయంకరమైన సంసార సముద్రాన్ని అతి సులభంగా దాటివేస్తారు. సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి అయిన ఆ మహాదేవుడికి కావలసింది మనోనైర్మల్యం, దృఢమైన భక్తి మాత్రమే. ఈ సత్యాన్ని శివమహాపురాణంలో సూత మహాముని మునులకు తెలియజేశారు. నిష్కల్మషమైన భక్తే శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఓం నమః శివాయ! <<-se>>#SIVOHAM<<>>

News October 13, 2025

నేడు CRDA భవనం ప్రారంభించనున్న CM చంద్రబాబు

image

AP: ఇవాళ్టి నుంచి అమరావతి కేంద్రంగా పుర పరిపాలన ప్రారంభం కాబోతోంది. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో పనిచేయాల్సిన అన్ని శాఖలు ఈ భవనం నుంచే పనిచేస్తాయి. నేడు ఉ.9.54కు CM చంద్రబాబు ఈ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. దీనికి రైతులందరూ ఆహ్వానితులే అని అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు అన్నదాతలు తమ సమస్యల పరిష్కారానికి విజయవాడ వెళ్లాల్సి వచ్చేది.