News October 13, 2025

AUS జట్టు అద్భుత ప్రదర్శన చేసింది: లోకేశ్

image

AP: <<17989428>>ఆస్ట్రేలియా<<>> మహిళల జట్టు వైజాగ్‌లో అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించిందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ఉమెన్స్ ODI క్రికెట్‌లో హయ్యెస్ట్ సక్సెస్‌ఫుల్ ఛేజింగ్(331 రన్స్) చేసిన ఆ జట్టును అభినందించారు. ‘330 రన్స్ చేసి, ఆఖరి వరకు పోరాడిన భారత మహిళల జట్టును చూస్తే గర్వంగా ఉంది. వైజాగ్ ఫ్యాన్స్ ఈ మ్యాచ్‌ను బాగా సెలబ్రేట్ చేసుకున్నారు’ అని ట్వీట్ చేశారు. CM చంద్రబాబు కూడా AUS జట్టును అభినందించారు.

Similar News

News October 13, 2025

ALL THE BEST: నేడు స్కూళ్లకు కొత్త టీచర్లు

image

AP: మెగా DSCలో ఎంపికైన నూతన టీచర్లు ఇవాళ విధుల్లో చేరనున్నారు. అటు వివిధ శాఖల్లో పని చేస్తూ జాబ్ సాధించిన వారు సైతం అక్కడ రిలీవ్ అయి బాధ్యతలు చేపట్టనున్నారు. ఉద్యోగం సాధించేందుకు వారు పడిన కష్టాలు తీరి నచ్చిన వృత్తిలోకి నేడు అడుగుపెట్టనుండగా, ఆ క్షణాలు ఎమోషనల్‌గా మారనున్నాయి. ఉపాధ్యాయ వృత్తికి మరింత విలువ తెస్తూ భావిభారత పౌరులను తీర్చిదిద్దాలని కోరుకుంటూ వారందరికీ Way2News తరఫున ALL THE BEST.

News October 13, 2025

పరమాత్మను చేరే భక్తి మార్గాలు

image

పరమాత్ముడి అనుగ్రహాన్ని పొందేందుకు 9 రకాల భక్తి మార్గాలను మన ధర్మశాస్త్రాలు నిర్దేశించాయి. వీటినే నవవిధ భక్తిసాధనలని అంటారు. శ్రవణం, కీర్తనం, స్మరణం ద్వారా స్వామి నామ గుణాలను మనసులో నింపుకోవాలి. పాదసేవ, అర్చనం, వందనం ద్వారా దేహంతో ఆరాధించాలి. దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం ద్వారా భావంతో స్వామికి శరణాగతి చెందాలి. ఈ మార్గాల్లో ఏదో ఒక దాన్ని నిష్కల్మషంగా ఆచరించినా మోక్షం సిద్ధిస్తుంది. <<-se>>#Bakthi<<>>

News October 13, 2025

ఈ నెల 22 నుంచి రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లు

image

TG: జిన్నింగ్ మిల్లుల్లో జాబ్ వర్క్ టెండర్ల ప్రక్రియ పూర్తికాగానే రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లు చేపట్టేందుకు CCI ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 22 నుంచి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. ఇవాళ పత్తి క్లీనింగ్ ధరలపై సంప్రదింపులు పూర్తయ్యాక మిల్లర్లతో CCI ఒప్పందం చేసుకోనుంది. టెండర్లు ఆమోదించాక మిల్లర్ల వివరాలు జిల్లా కలెక్టర్లకు అందజేస్తారు. తర్వాత ఆ మిల్లులను పత్తి కొనుగోళ్లు కేంద్రాలుగా నోటిఫై చేస్తారు.