News October 13, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News October 13, 2025

ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

image

నేడు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. APలోని అల్లూరి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని APSDMA తెలిపింది. TGలోని పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, యాదాద్రి, వరంగల్, వనపర్తి, HYD జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే ఛాన్సుందని HYD వాతావరణ కేంద్రం పేర్కొంది.

News October 13, 2025

విమానాలు తనిఖీ చేయండి.. AIR INDIAకి DGCA ఆదేశం

image

ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 విమానాల్లో ర్యామ్ ఎయిర్ టర్బైన్(RAT) సిస్టమ్‌ను పరిశీలించాలని DGCA ఆదేశించింది. ఇటీవల AIR INDIA డ్రీమ్ లైనర్‌ ఫ్లైట్‌లో అకారణంగా RAT యాక్టివేట్ అయ్యింది. సాధారణంగా రెండు ఇంజిన్స్ ఫెయిలైనప్పుడే ఇది యాక్టివేట్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే DGCA దర్యాప్తు చేపట్టింది. ఇలాంటి ఘటనలు, దానిని రెక్టిఫై చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు ఏంటో చెప్పాలని బోయింగ్ సంస్థను కూడా కోరింది.

News October 13, 2025

APPLY NOW: BELలో 88 పోస్టులు

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) 88 పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్(49) పోస్టులకు అప్లైకి ఈనెల 30 ఆఖరు తేదీ కాగా.. సీనియర్ అసిస్టెంట్ ఇంజినీర్(9) పోస్టులకు ఈనెల 28, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు(30) ఈనెల 29 చివరి తేదీ. పోస్టును బట్టి ITI, డిప్లొమా, BE, బీటెక్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://bel-india.in/