News October 13, 2025
చైనాను బాధ పెట్టాలి అనుకోవట్లేదు: ట్రంప్

చైనాకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదనంగా 100% టారిఫ్స్ విధించిన విషయం తెలిసిందే. అయితే తాను చైనాను బాధ పెట్టాలి అనుకోవట్లేదని పేర్కొన్నారు. ‘చైనా గురించి ఆందోళన వద్దు ఆ దేశం బాగానే ఉంటుంది. అధ్యక్షుడు జిన్‌పింగ్ కాస్త గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు. ఆయన గానీ, నేను గానీ చైనాకు ఇబ్బందులు రావాలి అనుకోవట్లేదు. US చైనాకు సాయం చేయాలనుకుంటోది. దానిని బాధించాలని కాదు’ అని ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.
Similar News
News October 13, 2025
రాత్రి కదిరి రోడ్డుపై తాగి ప్రేమజంట రచ్చ

కదిరిలో తప్పతాగి ప్రేమజంట రచ్చ చేసినట్లు CI నారాయణరెడ్డి తెలిపారు. కదిరి టౌన్‌లోని థాయి గ్రాండ్ హోటల్ సమీపంలో ఆదివారం రాత్రి తాగి స్థానికులతో గొడవకు దిగినట్లు ఆయన తెలిపారు. అడ్డుకోబోయిన పోలీసులతో సైతం దురుసుగా ప్రవర్తించారన్నారు. ప్రేమజంటను కడప(D) చక్రాయపేటకు చెందిన లోకేష్, బి.కొత్తకోటకు చెందిన షేక్ బానుగా గుర్తించారు. వారిని హాస్పిటల్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు CI స్పష్టం చేశారు.
News October 13, 2025
పడిపోయిన ఉల్లి ధరలు.. కిలో రూ.5-రూ.10!

AP: ఉమ్మడి కడప(D) ఉల్లికి తాడేపల్లిగూడెం మార్కెట్లో గిట్టుబాటు ధర దక్కలేదని రైతులు వాపోయారు. కిలో రూ.5-రూ.10 వరకే కొనుగోలు చేశారని ఆవేదన చెందారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన ఉల్లికి కిలో రూ.12-రూ.18 వరకు ధర పలికింది. ఇటీవల ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర దక్కకపోవడంతో ప్రభుత్వం క్వింటా రూ.1,200కు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
* రోజూ అగ్రికల్చర్ కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News October 13, 2025
నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా?

ఉదయం నిద్ర లేవగానే అలసటగా అనిపించడం పలు ఆరోగ్య సమస్యలకు సంకేతమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అది షుగర్ వ్యాధికి సంకేతమని చెబుతున్నారు. రక్తంలో షుగర్ స్థాయి పెరిగినప్పుడు ఎనర్జీ లెవల్స్ తారుమారవుతాయి. దాంతో లేవగానే అలసట, గొంతు ఎండిపోవడం, కంటిచూపు మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయంటున్నారు. క్రమంగా అలాంటి లక్షణాలే కనిపిస్తుంటే కచ్చితంగా వైద్యులను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు.