News October 13, 2025

మల్యాల: సంతానం లేదనే బాధతో.. వ్యక్తి ఆత్మహత్య

image

మల్యాల మండలం మద్దుట్ల గ్రామానికి చెందిన ఉప్పు శంకర్(43) శనివారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు. ఆరేళ్ల క్రితం వివాహమైనా పిల్లలు లేరనే బాధతో శంకర్ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుని భార్య శిరీష పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Similar News

News October 13, 2025

తెలంగాణ అప్డేట్స్

image

* బీసీ రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం
* జూబ్లీహిల్స్ బై పోల్‌కు నేడు నోటిఫికేషన్
* బూత్‌లకు రాలేకపోయిన చిన్నారులకు ఇవాళ, రేపు ఇంటింటికి వెళ్లి పోలియో డ్రాప్స్ వేయనున్న వైద్య సిబ్బంది
* 2,620 మద్యం దుకాణాలకు 5,663 దరఖాస్తులు.. ఈ నెల 18తో ముగియనున్న గడువు
* గ్రూప్-1 అధికారులుగా నియమితులైన వారిలో 131 మందిని 26 జిల్లాలకు ఎంపీడీవోలుగా నియామకం

News October 13, 2025

ఉమెన్స్ వరల్డ్ కప్: 3 వికెట్లు తీసిన శ్రీ చరణి

image

ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్‌-2025లో కడప జిల్లా ఎర్రగుంట్లకు చెందిన నల్లపురెడ్డి శ్రీ చరణి రాణిస్తోంది. నిన్న వైజాగ్‌లో ఆస్ట్రేలియాతో ఆడిన మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసింది. 10 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది. ఇందులో ఒక మెయిడెన్ కూడా ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో ఇండియా 3 వికెట్ల తేడాతో ఓడిపోన విషయం తెలిసిందే. ఈ వరల్డ్ కప్‌లో మెత్తం 6 వికెట్లు తీసింది.

News October 13, 2025

ADB: రేషన్ కమీషన్.. డీలర్ల పరేషాన్

image

రేషన్ డీలర్లకు రాష్ట్ర ప్రభుత్వం కమీషన్ బకాయిలు చెల్లించకపోవడంతో పరేషాన్ అవుతున్నారు. నెలల తరబడి కమీషన్ డబ్బులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, దుకాణాల అద్దెలు సైతం కట్టలేకపోతున్నామని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం డీలర్లకు క్వింటాకు రూ.140 చెల్లిస్తుంది. ఉమ్మడి జిల్లాలో 1468 రేషన్ షాపులున్నాయి. వీటిని నడుపుతున్న డీలర్లు కమీషన్ చెల్లించాలని కోరుతున్నారు.