News October 13, 2025
వేణు ‘ఎల్లమ్మ’ ప్రాజెక్ట్ నుంచి నితిన్ ఔట్?

బలగం మూవీతో డైరెక్టర్‌గా బ్లాక్ బస్టర్ అందుకున్న వేణు తర్వాత ‘ఎల్లమ్మ’ చేయనున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో ఇంకా హీరో ఫైనల్ కాలేదని తెలుస్తోంది. మొదట నితిన్ పేరు వినిపించింది. నిర్మాత దిల్ రాజు కూడా ఆ విషయాన్ని కన్ఫామ్ చేశారు. కానీ, ఇప్పుడు నితిన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఈ కథను బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు వినిపించగా ఓకే చేశారని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
Similar News
News October 13, 2025
పడిపోయిన ఉల్లి ధరలు.. కిలో రూ.5-రూ.10!

AP: ఉమ్మడి కడప(D) ఉల్లికి తాడేపల్లిగూడెం మార్కెట్లో గిట్టుబాటు ధర దక్కలేదని రైతులు వాపోయారు. కిలో రూ.5-రూ.10 వరకే కొనుగోలు చేశారని ఆవేదన చెందారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన ఉల్లికి కిలో రూ.12-రూ.18 వరకు ధర పలికింది. ఇటీవల ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర దక్కకపోవడంతో ప్రభుత్వం క్వింటా రూ.1,200కు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
* రోజూ అగ్రికల్చర్ కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News October 13, 2025
నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా?

ఉదయం నిద్ర లేవగానే అలసటగా అనిపించడం పలు ఆరోగ్య సమస్యలకు సంకేతమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అది షుగర్ వ్యాధికి సంకేతమని చెబుతున్నారు. రక్తంలో షుగర్ స్థాయి పెరిగినప్పుడు ఎనర్జీ లెవల్స్ తారుమారవుతాయి. దాంతో లేవగానే అలసట, గొంతు ఎండిపోవడం, కంటిచూపు మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయంటున్నారు. క్రమంగా అలాంటి లక్షణాలే కనిపిస్తుంటే కచ్చితంగా వైద్యులను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు.
News October 13, 2025
రాష్ట్రంలో 13 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

APలో 13 ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎల్లుండే (OCT 15)ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు APPSC వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవచ్చు. వీటిలో అసిస్టెంట్ ఇంజినీర్(11), జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్(1), అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (1)పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిగ్రీ, డిప్లొమా, BE, బీటెక్ ఉత్తీర్ణత సాధించాలి. AMVI పోస్టుకు అదనంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వెబ్‌సైట్: https://portal-psc.ap.gov.in/