News October 13, 2025

నంద్యాలలో నేడు ఎస్పీ PGRS రద్దు

image

నంద్యాల జిల్లాలోని SP కార్యాలయంలో సోమవారం జరగవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు SP సునీల్ షెరాన్‌ తెలిపారు. అనివార్య కారణాలవల్ల తాత్కాలికంగా కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగిందని అన్నారు. కాబట్టి ప్రజలు ఎవరూ జిల్లా కేంద్రానికి రావద్దని సూచించారు. అక్టోబర్ 20వ తేదీన తిరిగి PGRSను యధావిధిగా కొనసాగిస్తామని ఆయన అన్నారు.

Similar News

News October 13, 2025

సింగిల్ టీచర్ స్కూల్స్.. టాప్‌లో ఏపీ

image

దేశంలో ఒకే టీచర్‌తో నడిచే గవర్నమెంట్ స్కూళ్లున్న రాష్ట్రాల్లో AP టాప్‌లో ఉంది. 2024-25 అకడమిక్ ఇయర్‌లో APలో 12,912, UP-9,508, జార్ఖండ్-91,72, MH-8,152, KA-7,349, TG-5,001(11వ స్థానం) స్కూళ్లలో ఒకే టీచరున్నారు. దేశంలో ఇలాంటివి 1,04,125 స్కూల్స్ ఉన్నాయి. వాటిల్లో 33 లక్షల స్టూడెంట్స్ ఉన్నారు. విద్యార్థులు చేరని స్కూళ్ల టీచర్లను వీటిలోకి పంపేందుకు రేషనలైజేషన్ చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది.

News October 13, 2025

ఇతిహాసాలు క్విజ్ – 34

image

1. రామాయణంలో అతిపెద్ద కాండము ఏది?
2. మహాభారతం రాయడానికి వ్యాసుడికి ఎంత కాలం పట్టింది?
3. విశాలాక్షుడు అని ఎవర్ని అంటారు?
4. ‘పితృ పక్షం’ అనేది ప్రధానంగా ఏ రెండు పండుగల మధ్య వస్తుంది?
5. భౌమ వారం అంటే ఏ వారం?
* సరైన సమాధానాలను సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>

News October 13, 2025

171 బ్యాంక్ ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే చివరి తేదీ

image

ఇండియన్ బ్యాంక్‌లో వివిధ విభాగాల్లో 171 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి CA/CWA/ICWA, పీజీ, బీఈ/బీటెక్, ఎంసీఏ/ఎమ్మెస్సీ, డిగ్రీ, MBA, PGDBA, PGDBMతోపాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 23-36 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://indianbank.bank.in/