News October 13, 2025
VKB: ఇసుక మాఫియాకు రాజకీయ నాయకుల అండా.?

VKB జిల్లాలోని ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. ఈ దందాకు అంతా బడా నాయకుల అండ దండలతోనే సాగుతుందని విశ్వసనీయ సమాచారం. దీనిని అరికట్టేందుకు పోలీసులు, టాస్క్‌ఫోర్స్ బృందాలు ప్రయత్నించిన వారిపైకి వాహనాలు ఎక్కిచ్చేస్తున్నారు. తాజాగా తాండూర్ ఓ సంఘటన చోటుచేసుకుంది. వాహనాలు ఆపిన మరుక్షణమే ఓ బడా నాయకుడితో ఫోన్ వచ్చేస్తుంది. వెంటనే విడిచిపెట్టకుంటే బెదిరింపులు పాల్పడుతున్నారని ప్రజలు వాపోతున్నారు.
Similar News
News October 13, 2025
MLA చెబితేనే వినుత బెడ్ రూంలో కెమెరా పెట్టాడు: YCP

MLA సుధీర్ చెబితేనే <<17986475>>వినుత బెడ్ రూం<<>>లో రాయుడు కెమెరా పెట్టాడని ‘X’ వేదికగా YCP ఆరోపించింది. ‘రాయుడు వినుత బెడ్రూంలో ఫోన్ పెట్టాడు. ఆమె డ్రెస్ మార్చుకుంటుండగా రింగ్‌టోన్ మోగడంతో వీడియో రికార్డవుతున్నట్లు గుర్తించింది. దొరికిపోయానంటూ రాయుడు బొజ్జల అనుచరుడు సుజిత్, చంద్రకు ఫోన్ చేశాడు. “తమ్ముడు తప్పించుకో.. మా పేర్లు చెబితే నీ ఫ్యామిలీని చంపేస్తాం” అంటూ వారు బెదిరించారు’ అని YCP ఆరోపించింది.
News October 13, 2025
చైనా- పీఆర్23 వరి వంగడం ప్రత్యేకతలు ఇవే

చైనా PR-23 వరిని ఒక్కసారే నాటి మూడేళ్లలో 6 పంటలను కోసే అవకాశం ఉండటంతో సాగు ఖర్చు 29% తగ్గినట్లు అధ్యయనాల్లో తేలింది. పంట 119 రోజుల్లోనే కోతకు వస్తుంది. తొలి కోతలో హెక్టారుకు 6.8-7.5 టన్నులు, తర్వాత కోతల్లో 5.4-6.3 టన్నుల దిగుబడి వస్తోంది. భారత్‌లో సగటు వరి దిగుబడి హెక్టారుకు 4.2 టన్నులే. ఆసియా, ఆఫ్రికాలోని 17 దేశాల్లో విభిన్న పర్యావరణ పరిస్థితుల్లో కూడా PR-23 వంగడం మెరుగైన దిగుబడినిస్తోంది.
News October 13, 2025
సంక్రాంతి నుంచి శ్రీశైలానికి హెలికాప్టర్ సేవలు!

TG: హెలీ టూరిజానికి రాష్ట్ర పర్యాటక శాఖ శ్రీకారం చుట్టనుంది. హైదరాబాద్ టు శ్రీశైలం వెళ్లేందుకు హెలికాప్టర్ సేవలను వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. నల్లమల అడవి మీదుగా గంట పాటు ఈ ప్రయాణం సాగనుంది. ఇది సక్సెస్ అయితే ఉమ్మడి వరంగల్‌లోని రామప్ప, లక్నవరానికీ విస్తరించాలని యోచిస్తోంది. ఈ సేవల కోసం బుకింగ్ యాప్ లేదా వెబ్‌సైట్ తీసుకురానుంది.