News October 13, 2025
1.7M బాట్ అకౌంట్స్ డిలీట్ చేసిన ‘X’

తాము ఈ వారంలో 1.7 మిలియన్ల బాట్ అకౌంట్స్ డిలీట్ చేసినట్లు ‘X'(ట్విట్టర్) పేర్కొంది. ఎలాన్ మస్క్ ఈ సంస్థను కొనుగోలు చేసినప్పుడే ‘X’ నుంచి బాట్ అకౌంట్స్‌ను పూర్తిగా తొలగిస్తానని మాటిచ్చిన విషయం తెలిసిందే. ‘రిప్లై స్పామ్‌లో భాగమైన 17 లక్షల బాట్ అకౌంట్స్ డిలీట్ చేశాం. రాబోయే రోజుల్లో మీరు మార్పు గమనిస్తారు. DM స్పామ్ మీద ఫోకస్ చేయబోతున్నాం.’ అని ఆ సంస్థ ప్రొడక్ట్ హెడ్ నికితా బియర్ పేర్కొన్నారు.
Similar News
News October 13, 2025
ఆదాయం తగ్గింది.. కేంద్ర మంత్రి పదవి వద్దు: సురేశ్ గోపి

కేంద్ర మంత్రి పదవి నుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు మలయాళ నటుడు సురేశ్ గోపి చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. పెట్రోలియం శాఖ సహాయమంత్రిగా ఉన్న ఆయన నిన్న BJP కార్యకర్తలతో మాట్లాడుతూ మనసులోని మాటను బయటపెట్టారు. ఆదాయం తగ్గడంతో మళ్లీ సినిమాల్లో నటించాలని ఉందని చెప్పారు. సినీ కెరీర్ వదిలిపెట్టాలని తాను ఎన్నడూ కోరుకోలేదన్నారు. తన పదవి కేరళకే చెందిన MP సదానందన్ మాస్టర్‌కు ఇవ్వాలని సూచించారు.
News October 13, 2025
24న గల్ఫ్ దేశాల పర్యటనకు సీఎం

AP: సీఎం చంద్రబాబు ఈనెల 24న గల్ఫ్ టూర్‌కు వెళ్లనున్నారు. దుబాయ్, అబుదాబిలో రెండు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అక్కడి ప్రవాసాంధ్రులతో జరిగే ప్రత్యేక సమావేశంలో P-4 కార్యక్రమం గురించి వివరించడంతోపాటు పెట్టుబడులపై చర్చించనున్నారు. ఈ మేరకు సీఎం టూర్‌కు కేంద్రం అనుమతిచ్చింది. ప్రవాసులతో భేటీకి అవసరమైన సహకారం అందించేందుకు ముందుకు వచ్చింది.
News October 13, 2025
ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా?

ప్రస్తుతకాలంలో యూట్యూబ్, ఇన్‌స్టాల్లో వైరల్ అయ్యే వాటిని ఫాలో అయ్యేవారి సంఖ్య పెరిగిపోయింది. ముఖ్యంగా అమ్మాయిలు ఇన్ఫ్లుయెన్సర్లు ఏం చెబితే అవి కొనడం, వాడటం చేస్తున్నారు. కానీ ఇది సరికాదంటున్నారు నిపుణులు. సోషల్‌మీడియాలో చూపించేవన్నీ నిజం కావని చెబుతున్నారు. మంచి, చెడు మధ్య తేడా గ్రహించేలా ఉండాలని సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో చూసిన ఉత్పత్తులను చూసి ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవద్దని చెబుతున్నారు.