News April 8, 2024
పొంగులేటి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా..!

పొంగులేటి ఏ పార్టీలో ఉంటే.. ఆ పార్టీ అభ్యర్థి ఖమ్మం ఎంపీగా గెలవడం పరిపాటిగా మారింది. 2014లో ఆయన YCPలో ఉండగా ఖమ్మం MPగా గెలిచారు. 2019లో TRSలో చేరగా.. ఆ పార్టీ నుంచి బరిలో నిలిచిన నామా విజయం సాధించారు. ప్రస్తుతం పొంగులేటి కాంగ్రెస్‌లో ఉండటంతో హస్తం పార్టీనే ఖమ్మం సీటును గెలుస్తుందని కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. మరి పొంగులేటి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా.. కామెంట్ చేయండి.
Similar News
News January 13, 2026
ఖమ్మం: సంక్రాంతి సందడి.. కిరాణా షాపులు కిటకిట!

సంక్రాంతి పండుగ వేళ జిల్లావ్యాప్తంగా మార్కెట్లు జనసందోహంతో సందడిగా మారాయి. పిండి వంటల కోసం కావాల్సిన సామాగ్రి కొనుగోలు చేసేవారితో కిరాణా షాపులు కిటకిటలాడుతున్నాయి. బియ్యం పిండి, నూనె, బెల్లం, నువ్వుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రజలు భారీగా తరలిరావడంతో వర్తక వాణిజ్యాలు ఊపందుకున్నాయి. పండుగ వెలుగులతో మార్కెట్లు కళకళలాడుతున్నాయి.
News January 13, 2026
రైతులకు ఊరట.. జిల్లాలో పుష్కలంగా యూరియా నిల్వలు

ఖమ్మం జిల్లాలో సాగు సీజన్‌కు సంబంధించి ఎరువుల కొరత లేదని జిల్లా వ్యవసాయాధికారి పుల్లయ్య తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 9,844 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. పీఏసీఎస్‌లు, ప్రైవేట్ డీలర్ల ద్వారా రైతులకు ఎప్పటికప్పుడు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఎరువుల దుకాణదారులు ఎంఆర్‌పీ ధరలకే విక్రయించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News January 13, 2026
నేడు ‘మంచుకొండ’ ఎత్తిపోతల పథకం ప్రారంభం

రఘునాథపాలెం మండల రైతుల దశాబ్దాల కల సాకారమవుతోంది. ప్రభుత్వం నిర్మించిన ‘మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని’ నేడు ప్రారంభించనున్నారు. రూ. 66.33 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా 37 చెరువులను నింపుతూ సుమారు 3,500 ఎకరాలకు సాగర్ జలాలు అందనున్నాయి. 2025 జనవరిలో శంకుస్థాపన చేసిన ఈ పథకాన్ని, మంత్రి తుమ్మల చొరవతో ఏడాదిలోనే పూర్తి చేసి సంక్రాంతి కానుకగా రైతులకు అంకితం చేస్తున్నారు.


