News October 13, 2025
KMR: 9 ఏళ్లు గడిచినా.. వసతుల విస్మరణ

కామారెడ్డి జిల్లాగా ఆవిర్భవించిన తర్వాత పాలన ప్రజలకు చేరువైంది. కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు, పంచాయతీలు ఏర్పాటు కావడంతో పరిపాలన వికేంద్రీకరణ జరిగింది. అయితే, జిల్లాల పునర్విభజన జరిగి 9 ఏళ్లు గడిచినా, కొత్తగా ఏర్పాటైన మండలాల్లోని అనేక ప్రభుత్వ కార్యాలయాలకు ఇప్పటికీ సొంత భవనాలు లేవు. ఎంతో ఆశయంతో జిల్లాలను పునర్వ్యవస్థీకరించినా, కనీస మౌలిక వసతుల కల్పనలో జాప్యం జరుగుతోంది.
Similar News
News October 13, 2025
నేడు విధుల్లోకి టూరిస్టు పోలీసులు

TG: రాష్ట్రంలోని టూరిస్ట్ పోలీస్ వ్యవస్థ అమల్లోకి రానుంది. శిక్షణ పూర్తి చేసుకున్న 80 మంది టూరిస్టు పోలీసులు నేడు విధుల్లో చేరనున్నారు. రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు రక్షణ కల్పించేలా పలు అంశాలపై వీరికి శిక్షణ ఇచ్చారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశాలైన యాదాద్రి, భద్రాచలం, కీసరగుట్ట, సోమశిల తదితర ఆలయాలతో పాటు చార్మినార్, గోల్కొండ, అనంతగిరి హిల్స్ వంటి సందర్శక ప్రాంతాల్లో వీరు అందుబాటులో ఉంటారు.
News October 13, 2025
వికారాబాద్ DCC రేసులో ఇద్దరు రెడ్డిలు

జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకం ప్రక్రియలో ఏఐసీసీ, పీసీసీ వేగం పెంచింది. ఈ క్రమంలో వికారాబాద్ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులతో నేడు ఏఐసీసీ, పీసీసీ అబ్జర్వర్స్ భేటీ కానున్నారు. వారితో ముఖాముఖిలో మాట్లాడి అభిప్రాయాలు సేకరించినన్నారు. ఇప్పటివరకు రేసులో వికారాబాద్ నియోజకవర్గం నుంచి పట్లోళ్ల రఘువీర్ రెడ్డి, అర్ద సుధాకర్ రెడ్డి, కిషన్ నాయక్ ఉన్నట్లు సమాచారం.
News October 13, 2025
పరవాడ: తీరానికి కొట్టుకొచ్చిన మత్స్యకారుడి మృతదేహం

పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం సముద్రతీరంలో ఈ నెల 11వ తేదీన చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుడు బంగార్రాజు మృతదేహం ఆదివారం దిబ్బపాలెం తీరానికి కొట్టుకొచ్చింది. ఎస్సై కృష్ణారావు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అందజేశారు.