News October 13, 2025
NGKL: డీసీసీ అధ్యక్ష పదవికి కొండ మణెమ్మ దరఖాస్తు

నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం మాజీ జడ్పీటీసీ కొండ మణెమ్మ ఆదివారం దరఖాస్తు చేసుకున్నారు. పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణ స్వామికి దరఖాస్తు పత్రాలను అందజేశారు. డీసీసీ అధ్యక్ష పదవి కోసం జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ సీనియర్ నాయకులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. అధ్యక్ష పదవి చివరికి ఎవరికి దక్కుతుందో చూడాలి.
Similar News
News October 13, 2025
NTR: నేటి నుంచి యూనిట్-2 పరీక్షలు

NTR జిల్లాలోని అన్ని పాఠశాలలో నేటి నుంచి యూనిట్-2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రైమరీ స్కూల్స్ నుంచి హైస్కూల్స్ వరకు ఈ పరీక్షలు 16వ తారీఖు వరకు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా S.C.E.R.T రూపొందించిన ప్రశ్నాపత్రాలతో ఈ పరీక్షలు జరగనున్నాయి. 1-5 తరగతుల ప్రశ్నా పత్రాలు మండల వనరుల కేంద్రం వద్ద, 6 నుంచి 10 తరగతుల ప్రశ్నా పత్రాలు మండల వనరుల కేంద్రం వద్ద భద్రపరిచామని విద్యా శాఖ అధికారులు తెలిపారు.
News October 13, 2025
మేడారానికి మంత్రి కొండా సురేఖ దూరం!

మేడారంలో ఈరోజు జరిగే జాతర పనుల సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరుకావట్లేదు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో ఏర్పడిన విభేదాల కారణంగానే సమీక్షకు మంత్రి హాజరుకావట్లేదని తెలుస్తోంది. మేడారంలో జరిగే అభివ్భద్ది పనుల టెండర్ల విషయంలో మంత్రుల మధ్య విభేదాల కారణంగా మంత్రి సురేఖ టూర్ షెడ్యూల్ విడుదల కాకపోవడంతో మేడారం సమీక్షకు హాజరుకావడం లేదని సమాచారం.
News October 13, 2025
యుద్ధాలను ఆపడంలో నేను నేర్పరిని: ట్రంప్

యుద్ధాలను ఆపడంలో తాను నేర్పరి అని US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ‘శాంతి కోసం కృషి చేసినందుకు నేనెప్పుడూ నోబెల్ బహుమతి కోరలేదు. ప్రజల ప్రాణాలను కాపాడటమే నా దౌత్యం లక్ష్యం. అంతేకానీ అవార్డుల కోసం కాదు. మిలియన్ల ప్రాణాలను కాపాడాను’ అని తెలిపారు. గాజా యుద్ధం కూడా ముగిసిందని, ఇది తాను పరిష్కరించిన 8వ వార్ అని పేర్కొన్నారు. అఫ్గాన్-పాక్ ఘర్షణల గురించి తెలిసిందని, దానిపైనా దృష్టి పెడతానన్నారు.