News October 13, 2025

నేడు CRDA భవనం ప్రారంభించనున్న CM చంద్రబాబు

image

AP: ఇవాళ్టి నుంచి అమరావతి కేంద్రంగా పుర పరిపాలన ప్రారంభం కాబోతోంది. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో పనిచేయాల్సిన అన్ని శాఖలు ఈ భవనం నుంచే పనిచేస్తాయి. నేడు ఉ.9.54కు CM చంద్రబాబు ఈ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. దీనికి రైతులందరూ ఆహ్వానితులే అని అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు అన్నదాతలు తమ సమస్యల పరిష్కారానికి విజయవాడ వెళ్లాల్సి వచ్చేది.

Similar News

News October 13, 2025

కోల్డ్రిఫ్ దగ్గు మందు కేసు.. చెన్నైలో ఈడీ సోదాలు

image

కోల్డ్రిఫ్ దగ్గు మందు వ్యవహారంపై కేంద్రం దర్యాప్తు ముమ్మరం చేసింది. సిరప్ తయారీ సంస్థ శ్రీసన్ ఫార్మాస్యూటికల్స్‌‌కు చెందిన 7 ప్రాంతాల్లో ఎఫ్‌డీఏ అధికారులతో కలిసి ఈడీ సోదాలు చేస్తోంది. చెన్నైలో డ్రగ్ కంట్రోల్ ఆఫీసు అధికారుల ఇళ్లలోనూ రెయిడ్స్ జరుగుతున్నాయి. కోల్డ్రిఫ్ సిరప్ తాగి MPలో 20 మందికి పైగా చిన్నారులు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో శ్రీసన్ కంపెనీ ఓనర్ రంగనాథన్ ఇప్పటికే అరెస్ట్ అయ్యారు.

News October 13, 2025

మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

image

TG: చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి(84) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం 5.30 గంటల సమయంలో హైదర్‌గూడలోని ఆసుపత్రిలో మృతి చెందారు. మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఉమ్మడి APలో ఏపీసీసీ ప్రతినిధి, గ్రీవెన్స్ సెల్ ఛైర్మన్‌తో పాటు పలు పదవుల్లో పనిచేశారు. 1999, 2014లో హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

News October 13, 2025

నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 271 పాయింట్లు పతనమై 82,229 వద్ద, నిఫ్టీ 76 పాయింట్లు నష్టపోయి 25,209 వద్ద ట్రేడవుతున్నాయి. అపోలో హాస్పిటల్స్, ఏషియన్ పేయింట్స్, మారుతీ సుజుకీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉండగా టాటా మోటార్స్, ఓఎన్‌జీసీ, యాక్సిస్ బ్యాంక్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.