News October 13, 2025
సంసార సాగరాన్ని దాటించే శివ లింగార్చన

శివుని గురించి శ్రవణం, కీర్తన, మననం చేయడం గొప్ప సాధన. ఈ సాధన ఆచరించలేని సామాన్యులు నిత్యం శివలింగార్చన చేస్తే చాలు. భయంకరమైన సంసార సముద్రాన్ని అతి సులభంగా దాటివేస్తారు. సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి అయిన ఆ మహాదేవుడికి కావలసింది మనోనైర్మల్యం, దృఢమైన భక్తి మాత్రమే. ఈ సత్యాన్ని శివమహాపురాణంలో సూత మహాముని మునులకు తెలియజేశారు. నిష్కల్మషమైన భక్తే శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఓం నమః శివాయ! <<-se>>#SIVOHAM<<>>
Similar News
News October 13, 2025
Gen Z protests: పరారీలో 540 మంది ఇండియన్ ఖైదీలు!

ఇటీవల నేపాల్‌లో జరిగిన Gen Z నిరసనల్లో 13 వేల మంది ఖైదీలు తప్పించుకున్నట్లు అక్కడి జైళ్ల విభాగం తాజాగా వెల్లడించింది. ఇందులో 7,700 మందిని తిరిగి పట్టుకున్నామని, మరో 5వేల మంది పరారీలోనే ఉన్నారని తెలిపింది. ఇందులో 540 మంది ఇండియన్లు, 108 మంది ఇతర దేశాల వాళ్లు ఉన్నట్లు తెలిపింది. అవినీతి, వారసత్వ పాలనకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారి పదుల సంఖ్యలో చనిపోయిన విషయం తెలిసిందే.
News October 13, 2025
APPLY NOW: జిప్‌మర్‌లో ఉద్యోగాలు

పుదుచ్చేరిలోని జిప్‌మర్ 5 ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టును బట్టి డిగ్రీ, MBBS/BDS, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు ఈ నెల 22లోగా అప్లై చేసుకోవచ్చు. వీటిని కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: http://jipmer.edu.in/
News October 13, 2025
కోల్డ్రిఫ్ దగ్గు మందు కేసు.. చెన్నైలో ఈడీ సోదాలు

కోల్డ్రిఫ్ దగ్గు మందు వ్యవహారంపై కేంద్రం దర్యాప్తు ముమ్మరం చేసింది. సిరప్ తయారీ సంస్థ శ్రీసన్ ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన 7 ప్రాంతాల్లో ఎఫ్‌డీఏ అధికారులతో కలిసి ఈడీ సోదాలు చేస్తోంది. చెన్నైలో డ్రగ్ కంట్రోల్ ఆఫీసు అధికారుల ఇళ్లలోనూ రెయిడ్స్ జరుగుతున్నాయి. కోల్డ్రిఫ్ సిరప్ తాగి MPలో 20 మందికి పైగా చిన్నారులు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో శ్రీసన్ కంపెనీ ఓనర్ రంగనాథన్ ఇప్పటికే అరెస్ట్ అయ్యారు.