News October 13, 2025
నేడు విద్యుత్ ఉద్యోగ జేఏసీతో ట్రాన్స్‌కో చర్చలు

AP: సమస్యల పరిష్కారానికి ఈ నెల 15నుంచి సమ్మె చేపడతామన్న విద్యుత్ ఉద్యోగ సంఘాలు యాజమాన్యానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సమస్యల పరిష్కారానికి చర్చకు సోమవారం రావాలని పవర్ ఎంప్లాయిస్ జేఏసీకి ట్రాన్స్‌కో లేఖ రాసింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంస్థ కట్టుబడి ఉందని లేఖలో పేర్కొంది. ప్రజల, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ సంస్థలు సజావుగా సాగేలా చూడాలని ఉద్యోగులను కోరింది.
Similar News
News October 13, 2025
APPLY NOW: జిప్‌మర్‌లో ఉద్యోగాలు

పుదుచ్చేరిలోని జిప్‌మర్ 5 ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టును బట్టి డిగ్రీ, MBBS/BDS, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు ఈ నెల 22లోగా అప్లై చేసుకోవచ్చు. వీటిని కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: http://jipmer.edu.in/
News October 13, 2025
కోల్డ్రిఫ్ దగ్గు మందు కేసు.. చెన్నైలో ఈడీ సోదాలు

కోల్డ్రిఫ్ దగ్గు మందు వ్యవహారంపై కేంద్రం దర్యాప్తు ముమ్మరం చేసింది. సిరప్ తయారీ సంస్థ శ్రీసన్ ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన 7 ప్రాంతాల్లో ఎఫ్‌డీఏ అధికారులతో కలిసి ఈడీ సోదాలు చేస్తోంది. చెన్నైలో డ్రగ్ కంట్రోల్ ఆఫీసు అధికారుల ఇళ్లలోనూ రెయిడ్స్ జరుగుతున్నాయి. కోల్డ్రిఫ్ సిరప్ తాగి MPలో 20 మందికి పైగా చిన్నారులు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో శ్రీసన్ కంపెనీ ఓనర్ రంగనాథన్ ఇప్పటికే అరెస్ట్ అయ్యారు.
News October 13, 2025
మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

TG: చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి(84) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం 5.30 గంటల సమయంలో హైదర్‌గూడలోని ఆసుపత్రిలో మృతి చెందారు. మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఉమ్మడి APలో ఏపీసీసీ ప్రతినిధి, గ్రీవెన్స్ సెల్ ఛైర్మన్‌తో పాటు పలు పదవుల్లో పనిచేశారు. 1999, 2014లో హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.