News October 13, 2025
ఈ నెల 22 నుంచి రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లు

TG: జిన్నింగ్ మిల్లుల్లో జాబ్ వర్క్ టెండర్ల ప్రక్రియ పూర్తికాగానే రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లు చేపట్టేందుకు CCI ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 22 నుంచి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. ఇవాళ పత్తి క్లీనింగ్ ధరలపై సంప్రదింపులు పూర్తయ్యాక మిల్లర్లతో CCI ఒప్పందం చేసుకోనుంది. టెండర్లు ఆమోదించాక మిల్లర్ల వివరాలు జిల్లా కలెక్టర్లకు అందజేస్తారు. తర్వాత ఆ మిల్లులను పత్తి కొనుగోళ్లు కేంద్రాలుగా నోటిఫై చేస్తారు.
Similar News
News October 13, 2025
ట్రంప్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత పౌర పురస్కారం

US అధ్యక్షుడు ట్రంప్‌కు ఇజ్రాయెల్ తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది. ఈ మేరకు ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ హానర్’ను ఇవ్వనున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్ వెల్లడించారు. యుద్ధాన్ని ముగించడంలో సాయం చేసినందుకు, బందీల విడుదలకు చేసిన కృషికి ఈ అవార్డును అందజేయనున్నట్లు తెలిపారు. సెక్యూరిటీ, సహకారం, శాంతియుత భవిష్యత్తు కోసం మిడిల్ ఈస్ట్‌లో ఆయన కొత్త శకానికి నాంది పలికారని కొనియాడారు.
News October 13, 2025
Gen Z protests: పరారీలో 540 మంది ఇండియన్ ఖైదీలు!

ఇటీవల నేపాల్‌లో జరిగిన Gen Z నిరసనల్లో 13 వేల మంది ఖైదీలు తప్పించుకున్నట్లు అక్కడి జైళ్ల విభాగం తాజాగా వెల్లడించింది. ఇందులో 7,700 మందిని తిరిగి పట్టుకున్నామని, మరో 5వేల మంది పరారీలోనే ఉన్నారని తెలిపింది. ఇందులో 540 మంది ఇండియన్లు, 108 మంది ఇతర దేశాల వాళ్లు ఉన్నట్లు తెలిపింది. అవినీతి, వారసత్వ పాలనకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారి పదుల సంఖ్యలో చనిపోయిన విషయం తెలిసిందే.
News October 13, 2025
APPLY NOW: జిప్‌మర్‌లో ఉద్యోగాలు

పుదుచ్చేరిలోని జిప్‌మర్ 5 ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టును బట్టి డిగ్రీ, MBBS/BDS, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు ఈ నెల 22లోగా అప్లై చేసుకోవచ్చు. వీటిని కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: http://jipmer.edu.in/