News October 13, 2025

విమానాలు తనిఖీ చేయండి.. AIR INDIAకి DGCA ఆదేశం

image

ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 విమానాల్లో ర్యామ్ ఎయిర్ టర్బైన్(RAT) సిస్టమ్‌ను పరిశీలించాలని DGCA ఆదేశించింది. ఇటీవల AIR INDIA డ్రీమ్ లైనర్‌ ఫ్లైట్‌లో అకారణంగా RAT యాక్టివేట్ అయ్యింది. సాధారణంగా రెండు ఇంజిన్స్ ఫెయిలైనప్పుడే ఇది యాక్టివేట్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే DGCA దర్యాప్తు చేపట్టింది. ఇలాంటి ఘటనలు, దానిని రెక్టిఫై చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు ఏంటో చెప్పాలని బోయింగ్ సంస్థను కూడా కోరింది.

Similar News

News October 13, 2025

కరూర్ తొక్కిసలాటపై CBI విచారణ: సుప్రీంకోర్టు

image

తమిళనాడు కరూర్ తొక్కిసలాట దుర్ఘటన దర్యాప్తును సుప్రీంకోర్టు CBIకి అప్పగించింది. SEPT 27న కరూర్‌లో జరిగిన తమిళ వెట్రి కట్చి అధినేత విజయ్ సభలో తొక్కిసలాట జరిగి 41 మంది చనిపోయారు. ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం SIT దర్యాప్తుకు ఆదేశించింది. TN అధికారులే దర్యాప్తు చేయడంపై విజయ్ సహా కొందరు అభ్యంతరం తెలుపుతూ SCని ఆశ్రయించారు. దీంతో జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ అంజారియా బెంచ్ CBI దర్యాప్తుకు నేడు ఆదేశించింది.

News October 13, 2025

దారుణం.. ఆరుగురు బాలురపై లైంగికదాడి

image

TG: హైదరాబాద్‌లోని సైదాబాద్ జువైనల్ హోమ్‌లో దారుణం జరిగింది. ఆరుగురు బాలురపై పర్యవేక్షకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. దసరాకు ఇంటికి వెళ్లిన సమయంలో ఓ బాలుడు జువైనల్ హోంకు తిరిగి వెళ్లనని కన్నీరు పెట్టగా తల్లి ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. బాధితుడి తల్లి పోలీసులను ఆశ్రయించగా మరో ఐదుగురిపై ఇలాగే దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News October 13, 2025

మద్యం తాగే మహిళలకు తీవ్ర వ్యాధుల ముప్పు

image

మద్యం తాగే అలవాటు ఆరోగ్యానికి హానికరం. ముఖ్యంగా మద్యం సేవించే మహిళలకు అనేక తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. స్త్రీల శారీరక నిర్మాణం పురుషులతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. కాబట్టి మద్యం ఎక్కువగా సేవిస్తే క్యాన్సర్, గుండెజబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి తీవ్ర వ్యాధులబారిన పడతారని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఆరోగ్యంగా జీవించాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవాలని సూచిస్తున్నారు.