News October 13, 2025

క్రాప: ‘చదువుకున్న స్కూలుకే టీచర్’

image

అయినవిల్లిలోని క్రాపకు చెందిన చిక్కం లక్ష్మి ఇటీవల జరిగిన ఏపీ డీఎస్సీ – 2025 పరీక్షలో స్కూల్ అసిస్టెంట్ హిందీ విభాగంలో జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ సాధించింది. అంతే కాకుండా తాను చదువుకున్న కె.జగన్నాథపురం జెడ్పీ హైస్కూల్‌లోనే పోస్టింగ్ దక్కించుకోవడం విశేషం. తాను చదువుకున్న క్లాస్ రూమ్‌లోనే విద్యార్థాలకు పాఠాలు చెప్పనుంది. లక్ష్మికి ఉపాధ్యాయులు, కుటుంబసభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News October 13, 2025

HYD: జనాలకు ప్రశ్నించేతత్వం పోయిందా?

image

జనాలకు ప్రశ్నించేతత్వం పోయిందని ఉదయాన్నే ఓ పెద్దాయన ఎల్బీనగర్‌లోని ఓ పెట్రోల్ బంక్ వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏంటని ఆరా తీస్తే.. బంక్‌లో 4 పంపులుంటే ఒకే దగ్గర పెట్రోల్ పోస్తున్నారు. క్యూలైన్ రోడ్డు మీదకు వచ్చింది. ఇంకోటి ఓపెన్ చేయమని జనాలు అడగటం లేదు. అడిగితే పట్టించుకోలేదు. యువతకు ఏమైందసలు ఫ్రీలెఫ్ట్ బ్లాక్ చేసినా, అంబులెన్స్‌కు సైడ్ ఇవ్వకపోయినా కనీసం స్పందిచడంలేదు’ అని ఆవేదన వెళ్లగక్కారు.

News October 13, 2025

టెస్టు క్రికెట్‌లో ఫాలో ఆన్ అంటే?

image

టెస్ట్ క్రికెట్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు(A) కంటే టీమ్(B) 200, అంతకంటే ఎక్కువ పరుగుల వెనుకంజలో పడితే ఫాలో ఆన్ రూల్ వర్తిస్తుంది. ఆ టైంలో A జట్టు 2వ ఇన్నింగ్స్‌‌కు బదులుగా B జట్టును మళ్లీ బ్యాటింగ్‌కు పిలవొచ్చు. ఫాలో ఆన్ విధించడం A జట్టు కెప్టెన్ ఇష్టం. మళ్లీ బ్యాటింగ్ చేయకుండా ప్రత్యర్థి జట్టును ఓడించగలమనే నమ్మకంతో దీన్ని ఎంచుకుంటారు. ఫాలో ఆన్‌లో జట్ల బ్యాటింగ్: A(1), B(1), B(2), A(2)

News October 13, 2025

గోకవరం ఆర్ & ఆర్ కాలనీ రోడ్లో DEAD BODY

image

గోకవరం ఆర్ & ఆర్ కాలనీ రోడ్డుపై మృతదేహం కలకలం రేపింది. సోమవారం ఉదయం గుర్తించిన స్థానికులు గోకవరం PSకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.