News October 13, 2025
పడిపోయిన ఉల్లి ధరలు.. కిలో రూ.5-రూ.10!

AP: ఉమ్మడి కడప(D) ఉల్లికి తాడేపల్లిగూడెం మార్కెట్లో గిట్టుబాటు ధర దక్కలేదని రైతులు వాపోయారు. కిలో రూ.5-రూ.10 వరకే కొనుగోలు చేశారని ఆవేదన చెందారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన ఉల్లికి కిలో రూ.12-రూ.18 వరకు ధర పలికింది. ఇటీవల ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర దక్కకపోవడంతో ప్రభుత్వం క్వింటా రూ.1,200కు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
* రోజూ అగ్రికల్చర్ కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
Similar News
News October 13, 2025
తాజా వార్తలు

* జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 11న పోలింగ్, 14న ఎన్నికల ఫలితాలు
* అమరావతిలోని రాయపూడిలో CRDA ఆఫీస్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
* మాజీ ఎమ్మెల్యే కొండారెడ్డి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
* IND vs WI: ఫాలో ఆన్‌లో సెంచరీ చేసి ఔటైన ఓపెనర్ క్యాంప్‌బెల్(115).. ప్రస్తుతం WI స్కోర్ 247/3.
News October 13, 2025
టెస్టు క్రికెట్‌లో ఫాలో ఆన్ అంటే?

టెస్ట్ క్రికెట్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు(A) కంటే టీమ్(B) 200, అంతకంటే ఎక్కువ పరుగుల వెనుకంజలో పడితే ఫాలో ఆన్ రూల్ వర్తిస్తుంది. ఆ టైంలో A జట్టు 2వ ఇన్నింగ్స్‌కు బదులుగా B జట్టును మళ్లీ బ్యాటింగ్‌కు పిలవొచ్చు. ఫాలో ఆన్ విధించడం A జట్టు కెప్టెన్ ఇష్టం. మళ్లీ బ్యాటింగ్ చేయకుండా ప్రత్యర్థి జట్టును ఓడించగలమనే నమ్మకంతో దీన్ని ఎంచుకుంటారు. ఫాలో ఆన్‌లో జట్ల బ్యాటింగ్: A(1), B(1), B(2), A(2)
News October 13, 2025
ఇంటర్వ్యూతో ICAR-NMRIలో ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని ICAR-నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ కాంట్రాక్ట్ పద్ధతిలో 4యంగ్ ప్రొఫెషనల్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులను ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయనుంది. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీతో పాటు పని అనుభవంగల అభ్యర్థులు ఈనెల 28న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. వయసు 21 నుంచి 45ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్‌సైట్: https://nmri.res.in/