News October 13, 2025
వంటకు ఏ నూనె వాడాలంటే?

మార్కెట్లో అనేక రకాల వంటనూనెలు అందుబాటులో ఉన్నాయి. అయితే వంటకు ఏ నూనె వాడాలో కేంబ్రిడ్జి యూనివర్సిటీలోని పాపులేషనల్ హెల్త్&న్యూట్రిషన్ ప్రొఫెసర్ నీతా ఫోరూహి తెలిపారు. రోజువారీ వంట కోసం సన్‌ఫ్లవర్/ రాప్‌సీడ్ ఆయిల్స్, సలాడ్స్, ఫినిషింగ్ కోసం ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, డీప్ ఫ్రైకి వెజిటేబుల్/ సన్‌ఫ్లవర్ ఆయిల్, అలాగే రుచి నచ్చితే నువ్వులనూనె, కొబ్బరినూనె, అవకాడో నూనె వంటలో వాడాలని ఆమె సూచించారు.
Similar News
News October 13, 2025
జూబ్లీహిల్స్‌లో BRSకు TRSతో ముప్పేనా?

గతంలో పలు ఎన్నికల్లో కారును పోలిన గుర్తులు BRSను ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు జూబ్లీహిల్స్ బైపోల్‌లో తెలంగాణ రక్షణ సమితి- డెమోక్రటిక్(TRS- D) రూపంలో ముప్పు పొంచి ఉంది. పేరు, జెండా ఒకేలా ఉండటం, ఉద్యమ పార్టీ BRSగా మారినా చాలామందికి TRSగానే గుర్తు. దీంతో TRS(D) డ్యామేజ్‌పై గులాబీ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. అటు కాంగ్రెస్‌కు బలమైన పోటీ కావడంతో ప్రత్యర్థులు ఈ కుట్ర చేశారని గులాబీదళం ఆరోపిస్తోంది.
News October 13, 2025
త్వరలో అమరావతి రైతులను కలుస్తా: CBN

AP: అమరావతి రైతులను <<17990155>>త్వరలో<<>> కచ్చితంగా కలుస్తానని, వారి త్యాగాలను గుర్తుంచుకుంటానని CM చంద్రబాబు అన్నారు. ఇవాళ చాలా ఆనందంగా ఉందని CRDA ఆఫీస్ ప్రారంభ కార్యక్రమంలో చెప్పారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో ప్రపంచంలోనే ఇంత పెద్ద ఎత్తున ల్యాండ్ పూలింగ్ అమరావతిలోనే జరిగిందన్నారు. HYDను మించిన రాజధానిని నిర్మిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని నదులన్నీ అనుసంధానం కావాల్సిన అవసరం ఉందన్నారు.
News October 13, 2025
ఏ దిక్కున ఏం ఉండాలంటే?

ఇంట్లో అందరూ సుఖశాంతులతో ఉండాలంటే తూర్పు, ఉత్తరం దిక్కులు లోతుగా ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఈశాన్యంలో నీటి గుంట (సంపు, బావి) ఉండాలంటున్నారు. ‘పడమర, దక్షిణం దిక్కులు ఎత్తుగా ఉండాలి. నైరుతిలో ధాన్యపు గాదెలు, ట్యాంకులు, ఎక్కువ బరువుండే నిర్మాణాలు ఉండాలి. వంటగది ఆగ్నేయంలో, బాత్‌రూమ్ వాయువ్యంలో ఉండాలి. ఈ ఆరు అమరికలు ఇంటికి బలాన్ని ఇస్తాయి’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>