News October 13, 2025
ఉమెన్స్ వరల్డ్ కప్: 3 వికెట్లు తీసిన శ్రీ చరణి

ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్-2025లో కడప జిల్లా ఎర్రగుంట్లకు చెందిన నల్లపురెడ్డి శ్రీ చరణి రాణిస్తోంది. నిన్న వైజాగ్‌లో ఆస్ట్రేలియాతో ఆడిన మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసింది. 10 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది. ఇందులో ఒక మెయిడెన్ కూడా ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో ఇండియా 3 వికెట్ల తేడాతో ఓడిపోన విషయం తెలిసిందే. ఈ వరల్డ్ కప్‌లో మెత్తం 6 వికెట్లు తీసింది.
Similar News
News October 13, 2025
ప్రారంభాలు తప్ప విక్రయాలు లేవా..?

తిరుచానూరు మామిడి కాయలు మండి వద్ద మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో మూడోసారి ప్రారంభమైన రైతుబజారు సైతం మూతపడింది. గత ప్రభుత్వం హయాంలో రెండు సార్లు, గత బుధవారం మూడోసారి ఈ మార్కెట్‌ను అధికారులు ప్రారంభించారు. అయితే రైతులు ఎవరూ రాకపోవడంతో మూతవేసి ఉంది. మార్కెట్‌లో సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
News October 13, 2025
MTM: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు స్వీకరించిన కలెక్టర్

కలెక్టర్ డీ.కే. బాలాజీ నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక-మీకోసం” కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్, డీఆర్ఓ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొని వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలను పరిశీలించారు. ప్రజల సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
News October 13, 2025
జూబ్లీహిల్స్‌లో BRSకు TRSతో ముప్పేనా?

గతంలో పలు ఎన్నికల్లో కారును పోలిన గుర్తులు BRSను ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు జూబ్లీహిల్స్ బైపోల్‌లో తెలంగాణ రక్షణ సమితి- డెమోక్రటిక్(TRS- D) రూపంలో ముప్పు పొంచి ఉంది. పేరు, జెండా ఒకేలా ఉండటం, ఉద్యమ పార్టీ BRSగా మారినా చాలామందికి TRSగానే గుర్తు. దీంతో TRS(D) డ్యామేజ్‌పై గులాబీ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. అటు కాంగ్రెస్‌కు బలమైన పోటీ కావడంతో ప్రత్యర్థులు ఈ కుట్ర చేశారని గులాబీదళం ఆరోపిస్తోంది.