News October 13, 2025

ఇతిహాసాలు క్విజ్ – 34

image

1. రామాయణంలో అతిపెద్ద కాండము ఏది?
2. మహాభారతం రాయడానికి వ్యాసుడికి ఎంత కాలం పట్టింది?
3. విశాలాక్షుడు అని ఎవర్ని అంటారు?
4. ‘పితృ పక్షం’ అనేది ప్రధానంగా ఏ రెండు పండుగల మధ్య వస్తుంది?
5. భౌమ వారం అంటే ఏ వారం?
* సరైన సమాధానాలను సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>

Similar News

News October 13, 2025

నగలు నల్లగా మారాయా? ఇలా చేయండి

image

పండుగలు వస్తే చాలు మహిళలు భద్రంగా దాచుకున్న నగలను ఒక్కోటి బయటకు తీస్తారు. కానీ కొన్నిసార్లు ఈ నగలు నల్లగా మారి, మెరుపు తగ్గుతాయి. దీనికోసం కొన్ని టిప్స్ పాటించండి. * వేడినీటిలో డిష్‌వాష్ లిక్విడ్/ షాంపూ వేసి నగలను నానబెట్టాలి. తర్వాత బ్రష్‌తో తోమితే మెరుపు తిరిగొస్తుంది. * బంగారుగాజులను నీటిలో నానబెట్టాలి. శనగపిండిలో వెనిగర్ కలిపి, మెత్తని పేస్టులా చేసి గాజులకు పట్టించి, కాసేపటి తర్వాత కడిగేయాలి.

News October 13, 2025

నేరుగా ఓటీటీలోకి కొత్త సినిమా

image

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన ‘తక్షకుడు’ మూవీ నేరుగా ఓటీటీలోకి రానుంది. త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఆ సంస్థ ట్వీట్ చేసింది. ‘అత్యాశ ప్రారంభమైతే ప్రతీకారం వెంటాడుతుంది’ అని రాసుకొచ్చింది. ఈ సినిమాకు ‘మిడిల్ క్లాస్ మెలోడిస్’ డైరెక్టర్ వినోద్ దర్శకత్వం వహించారు.

News October 13, 2025

రేషన్ బియ్యాన్ని గుర్తించేలా ర్యాపిడ్ కిట్స్: నాదెండ్ల

image

AP: పీడీఎస్(రేషన్) బియ్యాన్ని గుర్తించే ర్యాపిడ్ కిట్స్‌ను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. ఇవి రేషన్ బియ్యం అక్రమ రవాణాను గుర్తించేందుకు ఉపయోగపడుతాయని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి తరలిస్తున్న బియ్యాన్ని పరిశీలిస్తున్నామని, నిఘా విభాగం అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5,65,000 క్వింటాళ్లు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.