News October 13, 2025

15 నెలలవుతున్నా మార్పులేదు: అమరావతి రైతు ఐకాస

image

AP: కూటమి ప్రభుత్వం ఏర్పాటై 15 నెలలవుతున్నా తమ సమస్యలు పరిష్కారం కాలేదని అమరావతి రైతు ఐకాస నాయకులు వాపోయారు. అసైన్డ్ రైతుల భూములు, కౌలు చెల్లింపులు, ప్లాట్ కేటాయింపులు తదితరాలపై ప్రభుత్వం దృష్టిపెట్టడం లేదన్నారు. CRDAలో కిందిస్థాయి అధికారులు రికార్డులు తారుమారు చేస్తున్నారని ఆరోపించారు. CM వీలైనంత త్వరగా తమతో సమావేశం కావాలని డిమాండ్ చేశారు. లేకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

Similar News

News October 13, 2025

అఫ్గాన్-పాక్ మధ్య సరిహద్దు వివాదమేంటి?

image

పాక్-అఫ్గాన్ మధ్య సరిహద్దుల్లో ‘డ్యూరాండ్ లైన్’ వెంబడి తీవ్ర ఘర్షణలు జరుగుతున్నాయి. బ్రిటిష్ ప్రభుత్వం 1893లో గీసిన ఈ లైన్‌పై ఏళ్లుగా వివాదం కొనసాగుతోంది. Durand Lineను అఫ్గాన్ ఒప్పుకోలేదు. PAK మాత్రం ఆ లైన్‌ను ‘అంతర్జాతీయ సరిహద్దు’ అంటోంది. ఈక్రమంలో తాలిబన్ పాలనలో వివాదం మళ్లీ మొదలైంది. తాలిబన్ ఫైటర్లు పాక్ పెట్టిన కంచెను తొలగించడంతో గొడవ ముదిరింది. దీంతో తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి.

News October 13, 2025

నగలు నల్లగా మారాయా? ఇలా చేయండి

image

పండుగలు వస్తే చాలు మహిళలు భద్రంగా దాచుకున్న నగలను ఒక్కోటి బయటకు తీస్తారు. కానీ కొన్నిసార్లు ఈ నగలు నల్లగా మారి, మెరుపు తగ్గుతాయి. దీనికోసం కొన్ని టిప్స్ పాటించండి. * వేడినీటిలో డిష్‌వాష్ లిక్విడ్/ షాంపూ వేసి నగలను నానబెట్టాలి. తర్వాత బ్రష్‌తో తోమితే మెరుపు తిరిగొస్తుంది. * బంగారుగాజులను నీటిలో నానబెట్టాలి. శనగపిండిలో వెనిగర్ కలిపి, మెత్తని పేస్టులా చేసి గాజులకు పట్టించి, కాసేపటి తర్వాత కడిగేయాలి.

News October 13, 2025

నేరుగా ఓటీటీలోకి కొత్త సినిమా

image

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన ‘తక్షకుడు’ మూవీ నేరుగా ఓటీటీలోకి రానుంది. త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఆ సంస్థ ట్వీట్ చేసింది. ‘అత్యాశ ప్రారంభమైతే ప్రతీకారం వెంటాడుతుంది’ అని రాసుకొచ్చింది. ఈ సినిమాకు ‘మిడిల్ క్లాస్ మెలోడిస్’ డైరెక్టర్ వినోద్ దర్శకత్వం వహించారు.