News October 13, 2025

ఉమ్మడి వరంగల్‌లో మందకోడిగా మద్యం దరఖాస్తులు!

image

ఉమ్మడి WGL జిల్లాలో వైన్స్‌లకు దరఖాస్తు చేసేందుకు మద్యం వ్యాపారులు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 11 వరకు 294 షాపులకు కేవలం 258 దరఖాస్తులు రావడం గమనార్హం. సగటున ఒక వైన్సుకు ఒక దరఖాస్తు కూడా రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం వైన్స్ టెండర్ల దరఖాస్తు ఫీజు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచింది. దీంతో మద్యం వ్యాపారులు వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం. మీరు టెండర్ వేస్తున్నారా?

Similar News

News October 13, 2025

HZB: ఈనెల 17న స్పెషల్ యాత్రా బస్సు

image

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ హుజూరాబాద్ డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సు ఈనెల 17న ఉదయం 5 గంటలకు లక్నవరం, రామప్ప, మేడారం, మల్లూరు నరసింహస్వామి ఆలయాలకు ఒకరోజు యాత్రను నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ రవీంద్రనాథ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పెద్దలకు రూ.800, పిల్లలకు రూ.430 టికెట్ చార్జీలతో స్పెషల్ బస్సు వెళుతుందన్నారు. అడ్వాన్స్ బుకింగ్ కోసం 9959225924, 9704833971 నంబర్లను సంప్రదించాలన్నారు.

News October 13, 2025

అఫ్గాన్-పాక్ మధ్య సరిహద్దు వివాదమేంటి?

image

పాక్-అఫ్గాన్ మధ్య సరిహద్దుల్లో ‘డ్యూరాండ్ లైన్’ వెంబడి తీవ్ర ఘర్షణలు జరుగుతున్నాయి. బ్రిటిష్ ప్రభుత్వం 1893లో గీసిన ఈ లైన్‌పై ఏళ్లుగా వివాదం కొనసాగుతోంది. Durand Lineను అఫ్గాన్ ఒప్పుకోలేదు. PAK మాత్రం ఆ లైన్‌ను ‘అంతర్జాతీయ సరిహద్దు’ అంటోంది. ఈక్రమంలో తాలిబన్ పాలనలో వివాదం మళ్లీ మొదలైంది. తాలిబన్ ఫైటర్లు పాక్ పెట్టిన కంచెను తొలగించడంతో గొడవ ముదిరింది. దీంతో తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి.

News October 13, 2025

హై కమాండ్ మాకు క్లాస్ తీసుకోలేదు: మంత్రి సురేఖ

image

తనపై పార్టీ హై కమాండ్ క్లాస్ తీసుకుందని వస్తున్న వార్తలపై మంత్రి సురేఖ స్పందించారు. ‘కావాలనే కొన్ని ఛానెళ్లలో నాపై తప్పుడు వార్తలు రాస్తున్నారు. నన్ను ఎవరూ ఏమీ అనలేదు. నాకు అధిష్ఠానం క్లాస్ తీసుకుందనే వార్తల్లో నిజం లేదు. నేను పార్టీ లైన్ దాటలేదు. రెండు రోజుల నుంచి నా ఇంట్లోనే ఉన్నా. ఎక్కడికీ వెళ్లలేదు. నాపై వచ్చే ఫేక్ న్యూస్ నమ్మకండి’ అంటూ మంత్రి సురేఖ క్లారిటీ ఇచ్చారు.