News October 13, 2025
ఖమ్మం జిల్లాలో భారీగా తగ్గిన మిర్చి సాగు..!

విదేశాల్లో డిమాండ్ ఉన్నా, జిల్లాలో మిర్చి సాగు గణనీయంగా తగ్గింది. గతేడాది తీవ్ర నష్టాలు, చీడపీడలతో పెట్టుబడి కూడా దక్కకపోవడంతో రైతులు మిర్చిని తోటలోనే వదిలేశారు. దీంతో ఈసారి చాలామంది రైతులు మిర్చిని పక్కనపెట్టి పత్తి వైపు మొగ్గు చూపారు. గతేడాది 70 వేల ఎకరాల్లో సాగైన మిర్చి, ఈ ఏడాది కేవలం 30 వేల ఎకరాలకే పడిపోవడం గమనార్హం. ఎగుమతులు లేక ధర పడిపోయిందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
Similar News
News October 13, 2025
ADB: గుండా మల్లేశ్.. చరిత్రలో గుర్తుండిపోయే పేరు

గుండా మల్లేశ్ శ్రామికవర్గం మర్చిపోలేని పేరు. తాండూరు(M) రేచినిలో జన్మించిన ఆయన మెట్రిక్యులేషన్ చదివి, బెల్లంపల్లిలో క్లీనర్గా, డ్రైవర్గా పనిచేశారు. తోటి క్లీనర్లు, డ్రైవర్ల సమస్యలపై పోరాడారు. సింగరేణి కార్మికుడిగా చేరి CPIలో సభ్యత్వం తీసుకున్నారు. 1970లో ఉద్యోగానికి రాజీనామా చేసి కార్మిక నేతగా పేరు తెచ్చుకున్నారు. 8సార్లు పోటీ చేసి 4సార్లు ఎమ్మెల్యేగా గెలిచి విజమఢంకా మోగించారు.
#నేడు ఆయన వర్ధంతి.
News October 13, 2025
MHBD: ఈనెల 14 నుంచి 18 వరకు పలు రైళ్లు రద్దు

ఈనెల 14 నుంచి 18 వరకు గోల్కొండ, శాతవాహన, ఇంటర్ సిటీ, అప్ అండ్ డౌన్ పాసింజర్ రద్దు చేశారు. నెంబర్ 11020/11019 కోణార్క్ EXP 16, 17వ తేదీల్లో వయా గుంటూరు మీదుగా డైవర్ట్ చేశారు. 16న నెంబర్ 17205 షిరిడి EXP వయా నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా, 18న నెంబర్ 17206 షిరిడి EXP వయా గుంటూరు, పిడుగురాళ్ల, నల్గొండ మీదుగా డైవర్ట్ చేశారు. రైల్వే ప్రయాణికులు గమనించగలరని రైల్వే అధికారులు తెలిపారు.
News October 13, 2025
ప్రధాని మోదీతో ఏపీ రైతుల సమావేశం

ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన రైతుల సమావేశంలో ఏపీ నుంచి ఏడుగురు రైతులు పాల్గొన్నారు. వీరిలో G. కొండూరు మండలం, చెవుటూరు గ్రామానికి చెందిన మహిళా రైతు రమాదేవి తన రెండెకరాల మామిడి తోటలో ప్రకృతి సేద్యం ద్వారా కూరగాయలు, పప్పుదినుసులు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇదే సమావేశంలో ఏపీ ఆక్వా రంగ ప్రతినిధులు, ఆక్వా రైతులకు రాయితీలు అందించాలని ప్రధానిని కోరారు.