News October 13, 2025
ఐదేళ్లలో 30శాతానికి మహిళా ఉద్యోగులు: SBI

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ SBI 2030కల్లా మహిళా ఉద్యోగుల వాటాను 30శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఉన్న 2.40 లక్షల సిబ్బందిలో వీరి వాటా 27%గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. లింగ సమానత్వాన్ని ప్రోత్సహించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. మహిళలకు అనువైన పని వాతావరణం కల్పించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. మహిళలకు నాయకత్వ శిక్షణ తరగతులు నిర్వహిస్తామని వివరించారు.
Similar News
News February 14, 2026
మార్చి నుంచి చకచకా ‘వాహన్’ సేవలు

TG: వాహన యజమానులకు అందించే సేవలు మెరుగుపర్చేలా ప్రభుత్వం మార్చిలో ‘వాహన్‘ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. రిజిస్ట్రేషన్, లైసెన్స్ పునరుద్ధరణ, ఫీజుల చెల్లింపు, చిరునామాల మార్పు వంటి ఆన్‌లైన్ సేవలన్నీ ఈ పోర్టల్ ద్వారా అందుతాయి. కేంద్ర ప్రభుత్వ ‘సారథి’ పోర్టల్‌లోని సర్వీసులు దీనిలోనూ ఉంటాయి. ప్రస్తుతం SEC, HYD RTOలలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తేనున్నారు.
News February 14, 2026
శివరాత్రి మరునాడు ఆప్షనల్ హాలిడే

AP: మహాశివరాత్రి పర్వదినం ఈ నెల 15(ఆదివారం) నాడు ఉంది. ఆ మరునాడు అంటే సోమవారం ప్రభుత్వం ఉద్యోగులకు ఆప్షనల్ హాలిడేగా ప్రకటించింది. ఈమేరకు సాధారణ పరిపాలనా శాఖ ఇవాళ జీవో విడుదల చేసింది. శివరాత్రి భక్తులు జాగారం చేయనున్నందున మరునాడు సెలవు తీసుకొనేలా ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించింది.
News February 14, 2026
గతేడాది మాదిరే ఉంది.. బడ్జెట్‌పై బుగ్గన విమర్శలు

AP: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శలు గుప్పించారు. ‘బడ్జెట్ స్పీచ్‌లో అసత్యాలు చెప్పారు. సూపర్-6 అంటూ అధికారంలోకి వచ్చి వాటికి కేటాయింపులు లేవు. బడ్జెట్‌లో ఎలాంటి మార్పులు లేవు. గతేడాది బడ్జెట్ బుక్ చూసినట్లే ఉంది. ఊహాజనితమైన లెక్కలతో బడ్జెట్ రూపొందించారు. అసలు అప్పు ఎంత ఉందో చెప్పలేదు. ఏయే రంగాలకు ఎంత కేటాయించారో వెల్లడించలేదు’ అని వ్యాఖ్యానించారు.


