News October 13, 2025

పరవాడ: తీరానికి కొట్టుకొచ్చిన మత్స్యకారుడి మృతదేహం

image

పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం సముద్రతీరంలో ఈ నెల 11వ తేదీన చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుడు బంగార్రాజు మృతదేహం ఆదివారం దిబ్బపాలెం తీరానికి కొట్టుకొచ్చింది. ఎస్సై కృష్ణారావు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అందజేశారు.

Similar News

News October 13, 2025

మంత్రి సురేఖ లేకుండానే పొంగులేటి రివ్యూ!

image

తెలంగాణ మంత్రుల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. ఒకరి శాఖలో మరొకరి పెత్తనాలు పెరిగాయంటూ మంత్రులు అధిష్ఠానంకు మోర పెట్టుకునే స్థాయికి చేరాయి. తాజాగా వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రికి, వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ మధ్య టెండర్ల పంచాయతీ తీవ్రమైంది. దేవాదాయ శాఖ కింద ఉండే ఆలయంలో సురేఖ లేకుండానే పొంగులేటి రివ్యూ చేయడం ఇప్పుడు మరో వివాదంకు కేరాఫ్‌గా నిలిచింది.

News October 13, 2025

కాజీపేటలో వందే భారత్ స్లీపర్ కోచ్‌ల తయారీ కేంద్రం..!

image

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో వందే భారత్ స్లీపర్ రైళ్లను తయారు చేయాలని రైల్వే బోర్డు ఆలోచిస్తోంది. వివిధ రాష్ట్రాల నుంచి వందే భారత్ స్లీపర్ కోచ్‌లు కావాలని డిమాండ్ పెరుగుతుండటంతో కేంద్రంఈ ఆలోచన చేస్తోంది. దీనికోసం KZPT కోచ్ ఫ్యాక్టరీని కేటాయించాలని నిర్ణయించినట్లు తెలిసింది. వీలైనంత తొందరలో 200 భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. దీంతో KZPTకు అరుదైన గౌరవం దక్కనుంది.

News October 13, 2025

HNK: లైంగిక వేధింపులకు పాల్పడిన ఉద్యోగిపై కేసు, వేటు

image

హనుమకొండ కలెక్టరేట్లో రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ ఇర్ఫాన్ సోహెల్‌పై సుబేదారి స్టేషన్లో SC, ST కేసు నమోదైంది. అదే సెక్షన్లో పని చేస్తున్న ఓ దళిత ఉద్యోగిని పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై గతంలోనే కలెక్టర్ ఆయనను సస్పెండ్ చేశారు. బాధితురాలు శనివారం రాత్రి సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.