News October 13, 2025
ఉద్యోగాన్నీ వదిలి.. వీధి కుక్కలకు అమ్మ అయి

ఖమ్మం: వీధి కుక్కల పట్ల మమకారం పెంచుకొని, వాటి సంరక్షణ కోసం ఏకంగా తన ఉద్యోగాన్నే వదులుకుంది నగరానికి చెందిన ఓ మహిళ. దానవాయిగూడెంకు చెందిన పద్మ, గత 15 ఏళ్లుగా దాదాపు 100కు పైగా వీధి కుక్కలకు ఆశ్రయం ఇచ్చింది. క్రాఫ్ట్ టీచర్‌గా పనిచేసిన ఆమె, వాటిపై ప్రేమతో ఆ ఉద్యోగాన్ని కూడా వదిలేసింది. వాటిని పెంచేందుకు ప్రభుత్వం కొంత స్థలాన్ని కేటాయించాలని కోరుతోంది. ఆమె సేవను స్థానికులు అభినందిస్తున్నారు.
Similar News
News October 13, 2025
పల్నాడు: ‘ఐటీఐలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం’

పల్నాడు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో ఐదవ విడత ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ నరేంద్రనాథ్ తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 16వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, 17వ తేదీలోపు ఒరిజినల్ సర్టిఫికెట్లను ఐటీఐలో వెరిఫికేషన్ చేయించుకోవాలని ఆయన సూచించారు. 17వ తేదీన ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో కౌన్సెలింగ్ జరుగుతుందని ఆయన వెల్లడించారు.
News October 13, 2025
విద్యాసంస్థల్లో రేపు డ్రై డే: సిద్దిపేట కలెక్టర్

దోమలు వృద్ధి చెందకుండా అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలలో ఈ నెల 14న ప్రత్యేక డ్రైడే నిర్వహించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. వర్షాల ప్రభావంతో దోమలు అధికంగా వృద్ధిచెంది విద్యార్థులపై ప్రభావం చూపకుండా అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలో కార్యక్రమం నిర్వహించాలన్నారు.
News October 13, 2025
మంత్రి సురేఖ లేకుండానే పొంగులేటి రివ్యూ!

తెలంగాణ మంత్రుల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. ఒకరి శాఖలో మరొకరి పెత్తనాలు పెరిగాయంటూ మంత్రులు అధిష్ఠానంకు మోర పెట్టుకునే స్థాయికి చేరాయి. తాజాగా వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రికి, వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ మధ్య టెండర్ల పంచాయతీ తీవ్రమైంది. దేవాదాయ శాఖ కింద ఉండే ఆలయంలో సురేఖ లేకుండానే పొంగులేటి రివ్యూ చేయడం ఇప్పుడు మరో వివాదంకు కేరాఫ్‌గా నిలిచింది.