News October 13, 2025
యుద్ధాలను ఆపడంలో నేను నేర్పరిని: ట్రంప్

యుద్ధాలను ఆపడంలో తాను నేర్పరి అని US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ‘శాంతి కోసం కృషి చేసినందుకు నేనెప్పుడూ నోబెల్ బహుమతి కోరలేదు. ప్రజల ప్రాణాలను కాపాడటమే నా దౌత్యం లక్ష్యం. అంతేకానీ అవార్డుల కోసం కాదు. మిలియన్ల ప్రాణాలను కాపాడాను’ అని తెలిపారు. గాజా యుద్ధం కూడా ముగిసిందని, ఇది తాను పరిష్కరించిన 8వ వార్ అని పేర్కొన్నారు. అఫ్గాన్-పాక్ ఘర్షణల గురించి తెలిసిందని, దానిపైనా దృష్టి పెడతానన్నారు.
Similar News
News October 13, 2025
TTD డైరీలు వచ్చేశాయ్! ఎక్కడ కొనుగోలు చేయాలంటే?

2026కు సంబంధించి TTD క్యాలెండర్లు, డైరీలను అందుబాటులోకి తెచ్చింది. భక్తుల సౌకర్యార్థం వీటిని ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ కొనుగోలు చేసే సౌకర్యాన్ని కల్పించింది. ఇవి వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, నెల్లూరులోని TTD కళ్యాణ మండపాల్లో అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్ శ్రీవారి ఆలయంతో పాటు చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబైలోని ఎంపిక చేసిన ఎస్వీ ఆలయాల్లో కూడా కొనుగోలు చేయవచ్చు.
News October 13, 2025
TTD డైరీలు, క్యాలెండర్లను ఆన్‌లైన్‌లో ఎలా కొనుగోలు చేయాలంటే?

తిరుమల తిరుపతి దేవస్థానం 2026 సంవత్సరానికి సంబంధించిన డైరీలు, క్యాలెండర్లను ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌లోనూ అందుబాటులోకి తెచ్చింది. భక్తులు www.tirumala.org లేదా ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ల ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చు. ఆన్‌లైన్ బుకింగ్ చేసుకున్న భక్తులకు టీటీడీ తపాలా శాఖ ద్వారా ఇంటి వద్దకే వాటిని చేరవేసే సౌలభ్యాన్ని కల్పించింది. ఈ వెబ్‌సైట్లలోనే సప్తగిరి మ్యాగజైన్ కూడా అందుబాటులో ఉంది.
News October 13, 2025
ఇద్దరు సెంచరీ వీరులు ఔట్

ఢిల్లీలో భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ కీలక భాగస్వామ్యానికి తెరపడింది. సెంచరీ హీరోలు ఓపెనర్ క్యాంప్‌బెల్ (115), షై హోప్ (103) ఔటయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో 248 పరుగులకే కుప్పకూలిన కరేబియన్ జట్టు ఫాలో ఆన్‌లో పోరాడుతోంది. ప్రస్తుతం విండీస్ స్కోర్ 289/4 కాగా 19 రన్స్ ఆధిక్యంలో ఉన్నారు.