News October 13, 2025
మేడారానికి మంత్రి కొండా సురేఖ దూరం!

మేడారంలో ఈరోజు జరిగే జాతర పనుల సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరుకావట్లేదు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో ఏర్పడిన విభేదాల కారణంగానే సమీక్షకు మంత్రి హాజరుకావట్లేదని తెలుస్తోంది. మేడారంలో జరిగే అభివ్భద్ది పనుల టెండర్ల విషయంలో మంత్రుల మధ్య విభేదాల కారణంగా మంత్రి సురేఖ టూర్ షెడ్యూల్ విడుదల కాకపోవడంతో మేడారం సమీక్షకు హాజరుకావడం లేదని సమాచారం.
Similar News
News October 13, 2025
వెండిపై పెట్టుబడి: ట్రేడర్‌కు రూ.600 కోట్ల నష్టం!

కమోడిటీ ట్రేడింగులో అనుభవలేమి నిలువునా ముంచుతుందనేందుకు మరో ఉదాహరణ. కొండెక్కిన వెండిని ఒకరు భారీగా షార్ట్ చేశారని స్టాక్ మార్కెట్ కోచ్ ఏకే మాన్‌ధన్ ట్వీట్ చేశారు. అయితే రేటు ఇంకా ఎగిసి ATHకు చేరడంతో బ్రోకర్ ఆ పొజిషన్లను క్లోజ్ చేశారన్నారు. దాంతో ఆ ట్రేడర్ ఏకంగా రూ.600Cr నష్టపోయాడని తెలిపారు. అతడెవరో ఆయన వెల్లడించలేదు. మొదట ఎక్కువ ధరకు అమ్మి తర్వాత తక్కువ ధరకు కొని లాభపడటాన్ని షార్టింగ్ అంటారు.
News October 13, 2025
తణుకు: గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం

తణుకు మండలం పైడిపర్రు కాలువలో పడి గల్లంతైన బొమ్మనబోయిన జోగేంద్ర (13) మృతదేహాన్ని పోలీసులు సోమవారం గుర్తించారు. జోగేంద్ర తన స్నేహితులతో కలిసి ఆడుకుందామని వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడి ఆదివారం గల్లంతైన విషయం తెలిసిందే. అత్తిలి మండలం గుమ్మంపాడు సమీపంలో కాలువలో బాలుడు మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News October 13, 2025
వరంగల్: అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లు సీజ్

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వేర్వేరు ఘటనల్లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న నాలుగు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. నాలుగు కేసుల్లో ఆరుగురిని అరెస్ట్ చేసి 2 ట్రాక్టర్లు, 12 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. పాలకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు కేసులు, దామెరలో ఒక కేసు నమోదైంది.