News October 13, 2025

వరంగల్: ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల కోసం అక్టోబర్ 23 వరకు గడువు

image

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ నేతృత్వంలో టెన్త్, ఇంటర్ అడ్మిషన్లు పొందేందుకు అక్టోబరు 23 వరకు గడువు ఉందని వరంగల్ యూనిక్ కోఆర్డినేటర్ సమీఉల్లాబేగ్ తెలిపారు. ఎలాంటి విద్యార్హతలు లేకున్నా టెన్త్ అడ్మిషన్లు పొందవచ్చని, టెన్త్ ఉత్తీర్ణత సాధించిన వారందరూ ఇంటర్లో అడ్మిషన్లు పొందేందుకు అవకాశం ఉందని వెల్లడించారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలో చదువుకునేందుకు అవకాశం ఉందన్నారు. 7396135390 సంప్రదించాలన్నారు.

Similar News

News October 13, 2025

వరంగల్: అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లు సీజ్

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వేర్వేరు ఘటనల్లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న నాలుగు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. నాలుగు కేసుల్లో ఆరుగురిని అరెస్ట్ చేసి 2 ట్రాక్టర్లు, 12 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. పాలకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు కేసులు, దామెరలో ఒక కేసు నమోదైంది.

News October 13, 2025

మరికాసేపట్లో వర్షం

image

తెలంగాణలో రాబోయే 3 గంటల్లో పలు జిల్లాల్లో వర్షం కురుస్తుందని IMD తెలిపింది. కొత్తగూడెం, జనగాం, ఖమ్మం, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు ఏపీలో ఇవాళ కోస్తాంధ్రతో పాటు ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో వర్షాలు కురిశాయి.

News October 13, 2025

స్వీకరించిన అర్జీలను త్వరగా పరిష్కరిస్తాం: కలెక్టర్

image

అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ రకాల సమస్యలపై కలెక్టర్ ఆనంద్ అర్జీలను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులతో విచారణ చేయించి త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.