News October 13, 2025

భద్రాద్రి: నమోదైన వర్షపాతం వివరాలు

image

జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు మిల్లీమీటర్లలో ఇలా ఉన్నాయి.. మణుగూరు 108.8, చర్ల 106.8, కరకగూడెం 94, బూర్గంపాడు 83.8, గుండాల 67, అశ్వాపురం 65.5, పినపాక 48.5, టేకులపల్లి 45.3, ఆళ్లపల్లి 43.3, దమ్మపేట 42.3, దుమ్ముగూడెం 41.3, భద్రాచలం 38, లక్ష్మీదేవి పల్లి 29.8, ఇల్లందు 24.5, కొత్తగూడెం 21, పాల్వంచ 15, చండ్రుగొండ 9.5, అన్నపురెడ్డిపల్లి 7.8, సుజాతనగర్ 7.3, జూలూరుపాడు 0.8MM వర్షపాతం నమోదైంది.

Similar News

News October 13, 2025

JMKT: భారీగా తరలివచ్చిన పత్తి.. తగ్గిన ధర..!

image

రెండు రోజుల విరామం అనంతరం సోమవారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌ తిరిగి ప్రారంభమైంది. మార్కెట్‌కు పత్తి భారీగా తరలివచ్చింది. రైతులు 174 వాహనాల్లో 1408 క్వింటాళ్ల పత్తిని విక్రయానికి తీసుకురాగా, దీనికి గరిష్ఠంగా క్వింటాకు రూ.6,400 ధర పలికింది. గోనె సంచుల్లో తీసుకొచ్చిన 43 క్వింటాళ్ల పత్తికి గరిష్ఠంగా రూ.6,200 ధర లభించింది. గతవారం కంటే పత్తి ధర తాజాగా రూ.400 తగ్గింది.

News October 13, 2025

MBNR:Police Flag Day.. అప్లై చేసుకోండి ఇలా!

image

ప్రతి ఏడాది ఈనెల 21న నిర్వహించే “పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నామని ఎస్పీ డి.జానకి తెలిపారు.
✒6వ తరగతి-PG విద్యార్థులు
✒అంశం:1.డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర, 2.విద్యార్థులు డ్రగ్స్‌ నుండి ఎలా దూరంగా ఉండగలరు
✒పేరు నమోదుకు లింక్:https://forms.gle/jaWLdt2yhNrMpe3eA
✒వ్యాసాన్ని పేపర్‌పై రాసి.. ఫోటో/ PDFలో (500 పదాలు మించకూడదు) అప్‌లోడ్ చేయాలి
✒చివరి తేదీ:OCT 28

News October 13, 2025

సంగారెడ్డి: ముగిసిన ఓపెన్ స్కూల్ మూల్యాంకనం

image

జిల్లా కేంద్రంలోని సెయింట్ ఆంథోనీ డిగ్రీ కళాశాలలో ఈ నెల 9 నుంచి నిర్వహించిన ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ తరగతుల మూల్యాంకనం నేటితో ముగిసిందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సోమవారం తెలిపారు. మూల్యాంకనం చేసిన జవాబు పత్రాలను హైదరాబాద్‌లోని ఓపెన్ స్కూల్‌కు పంపించామన్నారు. త్వరలోనే వాటి ఫలితాలు వెలువరిస్తామన్నారు.